అరటి పండు - ఓట్స్‌తో అద్దిరిపోయే "కుకీస్"! - ఓవెన్ అవసరం లేకుండానే రెడీ
ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

Published : August 6, 2025 at 3:23 PM IST
Banana Oats Cookies Recipe : పిల్లలు ఇష్టంగా తినే చిరుతిళ్లలో కుకీస్ కూడా ఒకటి. అయితే, బయట షాప్స్ లేదా బేకరీల్లో దొరికేవి అంత ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు. అందుకే, మీకోసం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక సింపుల్ కుకీస్ రెసిపీని తీసుకొచ్చాం. ఓట్స్, అరటిపండుతో చేసుకునే ఇవి మంచి రుచికరంగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. అంతేకాదు, ఈ కుకీస్ ఒక్కసారి చేసుకుంటే కనీసం 15 నుంచి 20 రోజుల పాటు తాజాగా నిల్వ కూడా ఉంటాయి! పైగా ఈ కుకీస్ని ఓవెన్ అవసరం లేకుండానే చాలా సింపుల్‌గా స్టవ్ మీదనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన పదార్థాలు కూడా తక్కువే! మరి, ఈ సూపర్ టేస్టీ బనానా ఓట్స్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అవసరమైన పదార్థాలు :
- బటర్ - 65 గ్రాములు
- పంచదార - 65 గ్రాములు
- పాలు - 50ఎంఎల్
- అరటిపండు - ఒకటి
- ఓట్స్ - 50 గ్రాములు
- బేకింగ్ పౌడర్ - రెండు చిటికెళ్లు
- మైదా పిండి - 125 గ్రాములు
- చాక్లెట్ చిప్స్ - కొన్ని(గార్నిష్ కోసం)
రుచికరమైన "దద్దోజనం" - ఈ కొలతలతో చేస్తే పులుపు లేకుండా, గుడిలో ప్రసాదంలా ఉంటుంది!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బటర్, పంచదార వేసుకొని అవి రెండు చక్కగా కలిసి క్రీమ్‌లా అయ్యేలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి.
- ఆవిధంగా ప్రిపేర్ చేసుకున్నాక అందులో అరటిపండుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.
- తర్వాత అరటిపండు ముక్కలు ఆ క్రీమ్‌లో కలిసిపోయేలా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పాలు పోసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ మిశ్రమం చక్కగా మిక్స్ అయిన తర్వాత ఓట్స్‌ని యాడ్ చేసుకొని గరిటెతో మొత్తం కలిసేలా కింది నుంచి కలియతిప్పుతూ కలపాలి.

- అనంతరం బేకింగ్ సోడా వేసి కలిపి మైదా పిండిని జత చేసి మొత్తం కలిసేలా నెమ్మదిగా గరిటెతో కింది నుంచి కలియతిప్పుతూ బాగా మిక్స్ చేయాలి.
- తర్వాత ఒక బేకింగ్ ట్రే లేదా ప్లేట్ తీసుకొని దానిపై సిలికాన్ మ్యాట్ లేదా బటర్ పేపర్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కాస్త గ్యాప్ ఇచ్చి కుకీస్ షేప్‌లో ఒక్కో గరిటెడు వేసుకోవాలి.
- ఆ ట్రేలో సరిపడినన్ని వేసుకున్నాక ఒక్కో దానిపై అక్కడక్కడ కొన్ని చాక్లెట్ చిప్స్ పెట్టి గార్నిష్ చేసుకోవాలి.
- అనంతరం ఆ బేకింగ్ ట్రేని ఓవెన్లో ఉంచి 180 డిగ్రీల హీట్‌లో పావుగంట పాటు బేక్ చేసుకోవాలి.
వరలక్ష్మీ వ్రతం వేళ కరకరలాడే " మినప మసాలా గారెలు" - నూనె పీల్చకుండా టేస్టీగా వస్తాయి!

- ఒకవేళ మీ వద్ద ఓవెన్ లేనట్లయితే ఇలా స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు.
- ఇందుకోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టి అందులో ఒక చిన్న స్టాండ్ ఉంచాలి. ఆ తర్వాత గిన్నెను మూతతో క్లోజ్ చేసి హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి.
- అనంతరం మూత తీసి స్టాండ్‌పై బటర్ పేపర్ వేసి కుకీస్ పెట్టుకున్న ప్లేట్ ఉంచి మూత పెట్టి సిమ్‌లో 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
- మీరు ఓవెన్ లేదా స్టవ్ ఎలా బేక్ చేసుకున్నా అవి చక్కగా కాలి లేత గోల్డెన్ కలర్లోకి వచ్చాయనుకున్నాక వాటిని బయటకు తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే "బనానా ఓట్స్ కుకీస్" రెడీ అయిపోతాయి!

రక్షా బంధన్ స్పెషల్ : గోధుమపిండితో అప్పటికప్పుడు చేసుకునే "స్వీట్" - ఎంతో టేస్టీగా, ఈజీగా!

