Avakaya Pappanam Recipe in Telugu : వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు ఆవకాయ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఆవకాయతో తింటుంటే బిర్యానీ రుచైనా మార్చిపోవాల్సిందే. అయితే, ముద్దపప్పు విడిగా వండి ఆవకాయతో అందరూ తింటారు. కానీ, ఓసారి ఇలా ఆవకాయ పప్పన్నం ట్రై చేయండి. ఈ పప్పన్నంతో ఎవ్వరైనా సరే రెండు ముద్దలు అన్నం ఎక్కువే తింటారు. ఈ పప్పన్నం సింపుల్‌గానే చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా నోరూరించే ఆవకాయ పప్పన్నం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
హోటల్ దోసె పిండిలో వంట సోడా వేయరు - కానీ, కిటుకు అంతా అక్కడే!

కావాల్సిన పదార్థాలు
- కందిపప్పు - అరకప్పు
- బియ్యం - కప్పు
- టమోటా - 1
- మిరియాలు - 10
- ఉల్లిపాయ - 1
- దాల్చిన చెక్క - 1
- బిర్యానీ ఆకు - 1
- 2 టేబులుస్పూన్లు - ఆయిల్
- అరటీస్పూన్ - పసుపు
- నిమ్మకాయ - 1
- కొద్దిగా కొత్తిమీర తరుగు
- టేబుల్‌స్పూన్ - ఆవకాయ
తాలింపు కోసం
- 2 టేబుల్‌స్పూన్లు - నెయ్యి
- టీస్పూన్ - జీలకర్ర
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2
- కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి - 6
- కాస్త ఇంగువ

తయారీ విధానం
- ముందుగా ఒక కుక్కర్లోకి కప్పు బియ్యం, అరకప్పు కందిపప్పు వేసుకొని రెండుమూడుసార్లు బాగా కడగండి. ఆపై 3 గ్లాసులు నీళ్లు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, దాల్చిన చెక్క, అర టీ స్పూన్ పసుపు, బిర్యానీ ఆకు, 2 టేబులుస్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టండి.
- స్టవ్‌పై కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక విజిల్, లో ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

- ఈలోపు చిన్న రోటిలో వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- కుక్కర్లో ఆవిరి పోయిన తర్వాత మూత తీసి గ్లాసు నీళ్ల పోసి పప్పు మెదుపుకోవాలి. పప్పు మెదుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేయండి.
- పప్పు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు టేబుల్‌స్పూన్ ఆవకాయ వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించండి.
- ఇప్పుడు తాలింపు కోసం స్టవ్‌పై చిన్న కడాయి పెట్టి 2 టేబుల్‌స్పూన్లు నెయ్యి వేసి కరిగించండి.
- వేడివేడి నెయ్యిలో టీస్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, కాస్త ఇంగువ వేసి కలుపుకోండి.

- చివరిగా ఆవకాయ పప్పన్నంలో కొద్దిగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేయండి.
- వేడివేడి అన్నంతో ఈ ఆవకాయ పప్పన్నం ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కొత్త ఆవకాయ పప్పన్నం తయారీ మీకు నచ్చితే ఓసారి తప్పక ట్రై చేయండి.
ఇలా చేస్తే జొన్న రొట్టె కూడా ఉ"ప్పొంగుతుంది" - రొట్టె చేయడం రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు!
పల్లీలు, పుట్నాలపప్పు లేకుండానే "చిక్కటి చట్నీ" - ఇలా చేస్తే ఇడ్లీ, దోసెల్లోకి సూపర్!