ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే "బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు" - ఈ మసాలా పేస్ట్​ వేస్తే అమోఘమైన రుచి! - ASH GOURD MAJJIGA PULUSU

-బూడిద గుమ్మడితో వడియాలు కామన్​ - ఇలా మజ్జిగ పులుసు పెట్టుకోండి, అద్దిరిపోతుంది!

Ash Gourd Majjiga Pulusu
Ash Gourd Majjiga Pulusu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2025 at 3:24 PM IST

3 Min Read

Ash Gourd Majjiga Pulusu: చాలా మంది బూడిద గుమ్మడికాయను దిష్టి తీయడానికి, ఇంటి ముందు వేళాడదీయడానికి ఉపయోగిస్తారు. మరికొందరేమో దీనితో వడియాలు పెట్టుకుంటుంటారు. అయితే కేవలం ఈ పనులకు మాత్రమే కాకుండా గుమ్మడితో అద్దిరిపోయే మజ్జిగ పులుసు పెట్టుకోవచ్చు. దీని రుచి చాలా బాగుంటుంది. నార్మల్​గా చేసే పద్ధతిలో కాకుండా ఈ మసాలా పేస్ట్​ వేసి ఒక్కసారి చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. పైగా బూడిద గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి లేట్​ చేయకుండా ఈ గుమ్మడి మజ్జిగ పులుసును ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

మసాలా పేస్ట్​ కోసం:

  • పచ్చి కొబ్బరి తురుము - గుప్పెడు
  • మెంతులు - అర టీస్పూన్​
  • మిరియాలు - అర టీస్పూన్​
  • ధనియాలు - ఒకటిన్నర టీ స్పూన్లు
  • కందిపప్పు - అర కప్పు
  • శనగపప్పు - పావు కప్పు
  • జీలకర్ర - 3 టీస్పూన్లు
  • బెల్లం ముక్క - కొద్దిగా
  • పెరుగు - 1 కప్పు
  • అల్లం ముక్క - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 4
Ash Gourd
Ash Gourd (ETV Bharat)

మజ్జిగ పులుసు కోసం:

  • బూడిద గుమ్మడి కాయ - తగినంత
  • నూనె - 2 టీస్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఎండుమిర్చి - 4
  • ఇంగువ - అర చెంచా
  • పసుపు - పావు టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Ash Gourd Majjiga Pulusu
Ash Gourd Majjiga Pulusu (ETV Bharat)

తయారీ విధానం:

  • ఈ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా పేస్ట్​ సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఓ గిన్నెలోకి కందిపప్పు, శనగపప్పును తీసుకుని సరిపడా నీళ్లు పోసి ఓ పావు గంట నానబెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి రెండు టీస్పూన్ల నూనె పోసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత మెంతులు వేసి చిటపటలాడించాలి.
  • మెంతులు వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర అర నిమిషం పాటు వేయించి, ధనియాలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తుంపలు వేసి ఓ నిమిషం వేయించాలి.
Ash Gourd Majjiga Pulusu
Ash Gourd Majjiga Pulusu (ETV Bharat)
  • ఇవి మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి నానబెట్టిన కందిపప్పు, శనగపప్పు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి.
  • చివరగా పెరుగు, బెల్లం ముక్క వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారనివ్వాలి.
  • ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకుని పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు చిన్నది, లేతది బూడిద గుమ్మడి తీసుకుని సగానికి కట్​ చేసుకోవాలి. ఓ సగం ముక్కను శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి గింజలు లేకుండా చూసుకోవాలి.
Ash Gourd Majjiga Pulusu
Ash Gourd Majjiga Pulusu (ETV Bharat)
  • ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడించాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి.
  • ఆ తర్వాత ఎండుమిర్చి, ఇంగువ వేసి ఫ్రై చేసిన తర్వాత కట్​ చేసిన గుమ్మడి ముక్కలు వేసి బాగా కలపాలి.
  • అనంతరం పసుపు, ఉప్పు వేసి కలిపి ముక్కలు మునిగేలా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి.
Ash Gourd Majjiga Pulusu
Ash Gourd Majjiga Pulusu (ETV Bharat)
  • ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఓసారి కలిపి గ్రైండ్​ చేసిన మసాలా పేస్ట్​, ఓ అర కప్పు నీళ్లు పోసి కలిపి ఉడికించుకోవాలి.
  • పులుసు ఉడికి మిశ్రమం కాస్త దగ్గరపడిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేస్తే సరి. ఆరోగ్యానికి మేలు చేసే బూడిద గుమ్మడి మజ్జిగ పులుసు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Ash Gourd Majjiga Pulusu
Ash Gourd Majjiga Pulusu (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ మజ్జిగ పులుసు కోసం లేత బూడిద గుమ్మడి అయితే తొందరగా ఉడకడంతో పాటు టేస్ట్​ కూడా అద్దిరిపోతుంది.
  • అలాగే మసాలా పేస్ట్​ కోసం అవసరమైన దినుసులన్నింటినీ కూడా లో ఫ్లేమ్​లో మాత్రమే మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్​లో మగ్గిస్తే సరిగా వేగక పులుసు అంతగా రుచి ఉండదు.
  • ఈ పులుసు కాస్త చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది.

పాతకాలం నాటి "వట్టి తునకల కూర" - ఇలా చేస్తే గరం మసాలా అవసరం లేదు - బాలింతలు, పెద్దలకు చాలా మంచిది!

నీచు వాసన లేకుండా "చేపల ఇగురు" - ఈ పద్ధతిలో చేస్తే చిక్కటి గ్రేవీ - చింతపండు అవసరమే లేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.