"క్రష్, లవ్" టీనేజీ ప్రేమ పరీక్ష! - మీ పిల్లలకు ఎలా చెప్తున్నారు?
వయసు పెరుగుదలతో శారీరక, మానసిక మార్పులు - నిపుణులు ఏం చెప్తున్నారంటే!

Published : September 22, 2025 at 12:20 PM IST
Teenage Love and Relationships : యుక్తవయసులో కలిగేది ప్రేమా? ఆకర్షణా? ఎన్ని తరాలు మారినా జవాబు దొరకని ప్రశ్న. వాళ్లేమో ప్రేమంటారు. పేరెంట్స్ కాదంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కనిపించని వారధి ఏర్పడుతుంది. టీనేజీ ముఖ్యమైన దశ. ఈ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు జరుగుతాయి. దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా మసలుకోవాల్సింది పెద్దలే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

అంతలోనే ఉత్సాహం, నచ్చినట్టుగా జరగకపోతే ఉద్రేకం, భావోద్వేగాలు, మూడ్స్ మీద నియంత్రణ లోపించడం, హఠాత్తుగా ప్రవర్తనలో మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. అందుకనే టీనేజీని 'ఒత్తిడి-తుపాను' దశగా చెబుతుంటారు. ఇవన్నీ సరిపోనట్టుగా ఓ సారి ధైర్యస్థులు, పట్టుదల గలవారిగానూ, మరోసారి అనిశ్చితి, సున్నితత్వం మనస్కులుగానూ కనిపిస్తారని వివరించారు. ప్రేమ, క్రష్ వాటిల్లో వైఫల్యాలే వాళ్లకు పెద్ద సంఘటనలని, కొందరికి మరపురాని అనుభూతులనిస్తే, మరికొందరికి అనుభవాలను మిగులస్తాయని తెలిపారు. ఏదేమైనా ఈ దశని అందరూ దాటుకుని రావాల్సిందే అంటున్నారు. అయితే అది దాటించడమే తల్లిదండ్రులకు పెద్ద అగ్ని పరీక్షని చెబుతున్నారు.
కుక్కలు వెంటపడితే ఏం చేయాలి? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ఎలా మెలగాలి? : మీ పిల్లలు ఫ్రెండ్స్ ఎవరు, ఎవరికి ఎలాంటి, ఎంత ఖరీదైన బహుమతులిస్తున్నారు వంటివి పరిశీలిస్తూ ఉండాలని, వారిపై నిఘా ఉంచినట్లు కాకుండా నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. తరగతులు, స్నేహితులతో వేసుకునే ప్లాన్ వివరాలు కనుక్కోవాలని తెలిపారు. దీంతో మీ అనుభూతి తీసుకుని వెళ్లడం అలవాటు అవుతుందని, దీని వల్ల వాళ్లు అదుపు తప్పరన్న భరోసా మీకు దొరకుతుందని వివరించారు.
వాటి గురించి నెమ్మదిగా : ఈ నేపథ్యంలో ఎవరి మీదైనా క్రష్ ఉందనో? ప్రేమిస్తున్నాననో చెబితే? కంగారుపడొద్దని నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో హార్మోన్ల ప్రభావం చాలా ఉంటుందని, అది ఆకర్షణా? ఇతరుల్లో నచ్చే అంశాలా, మరొకటా అన్నది వాళ్లకీ తెలియదని, అందుకే కోపం చూపడం మంచిది కాదంటున్నారు. ఇలా ప్రవర్తిస్తే వాళ్లు ప్రతిదీ దాస్తారు. అందుకే వీలైతే ఆ 'స్పెషల్ ఫ్రెండ్'తో స్నేహం చేయండి. అంతమాత్రాన వాళ్ల బంధాన్ని సమ్మతిస్తున్నట్లు కాదని, ఆ వ్యక్తి గురించి, మీ పిల్లల ఇష్టాలు, ఎంపికల పట్ల మీకూ అవగాహన వస్తుందని తెలిపారు. తర్వాత మీ అనుభవాలు, ప్రాథమిక సెక్స్ ఎడ్యుకేషన్, ఆకర్షణల గురించి నెమ్మదిగా చెప్పండి. దీంతో వాళ్ల ఫీలింగ్స్‌ని వాళ్లే చెక్ చేసుకోవడం మొదలు పెడతారని పేర్కొన్నారు.

అర్ధమయ్యేలా : లైఫ్‌లో ప్రేమ, పెళ్లి కంటే ఆశయాలు, లక్ష్యాలు ఎంత ముఖ్యమో చెప్పండి. అనుకున్నది సాధించే వరకూ వాళ్ల ప్రేమ నిలబడుతుందేమో చెక్ చేసుకోమనండి. అదే నిజమైన ప్రేమని అర్ధమయ్యేలా చెప్పండి. అప్పుడు వారికి మీరు అండగా ఉంటామన్న భరోసాన్విమండి. ఒకవేళ విఫలమైతే? కించపరచొద్దు. సహానుభూతితో వారిని దగ్గరకు తీసుకుండి. ఎలాంటి పరిస్థితిలోనైనా మీతోడు ఉంటుందన్న ధైర్యాన్నివ్వండి. డిప్రెషన్, ఆత్మహత్యలు వంటివాటికి అవకాశముండదు. దీంతో టీనేజీ దశ దాటి ముందుకు సాగుతారు.

స్నేహం చేయండి : స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా టెక్నాలజీల కారణంగా తెలియని పరిచయాలు, వాటిని గుట్టుగా దాయడం పెరుగుతున్నాయి. ఇంట్లో వాళ్లకు తెలిసినా 'క్రష్' 'ప్రేమ' అని నిర్భయంగా చెబుతున్నారు. ఇలాంటప్పుడు చాలామంది తల్లిదండ్రులు అరవడం, కొట్టడం చేస్తారు. ఆ సమయంలోనే సంయమనం పాటించాలి. లేదంటే పరిస్థితి మరింత చేజారుతుంది. టీనేజీ దశలో మన ప్రవర్తనే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి, వారితో స్నేహం చేయండి. మారిపోయే భావోద్వేగాలతో పిల్లలూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. వాళ్లేమైనా చెబితే కొట్టిపారేయొద్దు. అప్పుడే అభిప్రాయాలను నిర్భయంగా పంచుకుంటారు. దాని ఆధారంగా వాళ్ల దిశని మార్చడం అమ్మానాన్నలకీ తేలికవుతుంది.
ఫ్లైట్ జర్నీలో షార్ట్స్ వేసుకుంటే ఏం జరుగుతుంది? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
జుట్టు తెల్లబడిందని రంగు వేస్తున్నారా? - అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

