ETV Bharat / lifestyle

హాట్ సమ్మర్​లో కూల్ కూల్ డ్రింక్స్- ఇవి తాగితే డీహైడ్రేషన్​కు చెక్!

ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? -ఇవి ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు

summer_health_tips
summer_health_tips (Getty images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : March 17, 2025 at 5:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

Best Fruit Juices for Summer : భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరిగిపోతుంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అడుగు బయట పెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినవారు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందటానికి రకారకాల పండ్ల రసాలు తాగుతుంటారు. అయితే ప్రస్తుతం మండుతున్న ఎండలను ఎదుర్కోవడానికి, తక్షణ శక్తిని పొందేందుకు ఈ పానీయాలను ట్రై చేయండి! (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

తక్షణ శక్తి : ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత ఎన్ని నీళ్లు తాగిన దప్పిక తీరదు. ఇలాంటి సమయంలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందలన్నా, తక్షణ శక్తి కావాలన్నా పెరుగులో కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర తరుగు, పుదీనా కలిపి మజ్జిగ చేసి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరానికి చలవ : ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శరీరానికి చలవ అందించేందుకు సబ్జా గింజలు ఎంతగానో తోడ్పడతాయట. సబ్జాల ద్వారా చల్లదనమే కాకుండా మరెన్నో ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయని అంటున్నారు. మండుతున్న ఎండలు కారణంగా బాడీ డీ హైడ్రేషన్​కు గురి అవుతుంది. దాన్ని నుంచి ఉపశమనం పొందాలంటే సబ్జా గింజలను నానబెట్టిన నీళ్లల్లో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి చలవ చేసి బాడీ డీహైడ్రేషన్​కు గురి కాకుండా ఉంటుందని తెలిపారు.

summer_health_tips
సబ్జా నీరు (Getty images)

వడదెబ్బ తగలకుండా: ముఖ్యంగా ఎండలో ఎక్కువసేపు తిరిగితే వడదెబ్బ తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి అధిక మోతాదులో ఎలక్ట్రోలైట్ల కలిగి ఉన్న కొబ్బరి నీళ్లు తాగాలని అంటున్నారు. వీటిలో ఉండే మెగ్నీషియం, సోడియం వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని సమకూరుస్తాయి.

వేడిమి నుంచి రక్షణ : ఎండాకాలంలో చల్లచల్లగా పండ్ల రసాలు తాగుతూ ఉంటాం. మామిడి, కర్బూజ, ద్రాక్ష, యాపిల్, అరటి, సపోటా లాంటి రకరకాల పండ్లను అప్పటికప్పుడు జ్యూస్ చేసుకుంటూ ఉంటారు. పండ్ల రసాలు శక్తిని అందించడంతో పాటు ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు సాయపడతాయని అంటున్నారు. చక్కెర లేకుండా చేసిన జ్యూస్​లను తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

summer_health_tips
జ్యూస్ (Getty images)

శరీరం చల్లబడేలా : ఇంకా లస్సీ తాగడం వల్ల శరీరాన్ని వేగంగా చల్లబరుస్తుందని అంటున్నారు. తేనె, జీలకర్ర, యాలకులు కలిపి చిలికిన లస్సీని తీసుకుంటే ఎండ వల్ల కలిగే ఇబ్బంది తగ్గుతుందని చెబుతున్నారు.

summer_health_tips
summer_health_tips (Getty images)

నిమ్మ షర్బత్ : రోగనిరోధక శక్తిని వేగంగా పెంచి తక్షణ శక్తిని అందించే నిమ్మకాయను తేనె కలిపి తీసుకోవాలి. దీంట్లో నానబెట్టిన సబ్జా గింజలనూ కలపొచ్చు. ఈ షర్బత్ వడదెబ్బ నుంచి సంరక్షిస్తుంది. అంతే కాకుండా శరీరంలో వేడిని తగ్గించడానికి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయ నీటిని రోజు తాగడం వల్ల బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్​గా ఉండటంతో పాటు హనికరమైన టాక్సిన్ల నుంచి కూడా తప్పించుకోవచ్చు.

summer_health_tips
నిమ్మ షర్బత్ (Getty images)

పుల్లగా తియ్యగా : పచ్చి మామిడిని ఉడకబెట్టి రసం తీసి పంచదార, జీలకర్ర, నల్ల ఉప్పు, పుదీనా కలిపి పానీయం తయారు చేస్తారు. ఇది పుల్లగా తియ్యగా ఉంటుందని.. పంచదార ఇష్టం లేని వారు తేనె వాడొచ్చని సూచిస్తున్నారు.

summer_health_tips
మామిడి కాయ (Getty images)

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రంజాన్​లో ఖర్జూరం ఎందుకు తింటారో తెలుసా? వీటి వల్ల కలిగే ప్రయోజనాలివే!

జొన్న రొట్టెలు తింటే షుగర్ తగ్గుతుందా? ఇందులో నిజమెంత? డాక్టర్లు ఏం అంటున్నారంటే?