"వరద" నీటితో ఆటలొద్దు - తెలియకుండానే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయంటున్న నిపుణులు!
వరద ముప్పు - ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Published : August 29, 2025 at 1:01 PM IST
Safety Measures to Protect Health During Floods : చుట్టూ నీరు, అడుగుతీసి అడుగు వేయడమే కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో తినడానికి తిండి ఉండదు. తాగడానికి నీరు అందుబాటులో ఉండదు. కనుచూపు మేర మనిషి జాడ కూడా కనిపించదు. ఈ వరదల కాలంలో ముంచెత్తే ఆ నీటిలో విష పదార్థాలు చేరొచ్చు. విష పురుగులూ ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోకుండా ఉరవడిలోకి వెళితే అనుకోని ఉపద్రవాలూ తలెత్తొచ్చు. వరద మిగిల్చిన బురదలోనూ ఎన్నో ప్రమాదాలు దాగుంటాయి. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

అవి అనర్థాలు : వరదనీటిలో కొట్టుకొచ్చే రసాయన, పారిశ్రామిక అవశేషాలు మంచినీటిని కలుషితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీళ్లలో ఉండే ఇంజక్షన్ సూది లాంటివి నడిచే వారికి గుచ్చుకుంటే ప్రమాదకరంగా మారొచ్చంటున్నారు. పురుగు, కలుపు, మందులు, ఎరువుల అవశేషాలు ఆ నీటిలో ఉంచొచ్చని పేర్కొన్నారు. ఆటో మొబైల్, ద్రవాలు, డ్రెయిన్ క్లీనర్లు, వైద్య వ్యర్థాలు, డ్రెస్సింగ్‌లు, శరీర భాగాలు, ఫార్మాస్యూటికల్స్ వంటివి చాలా హానిచేస్తాయని వివరించారు. రంగులు, ఆమ్లాలు, రేడియో యాక్టివ్ పదార్థాలు, హెవీ మెటల్స్, హైడ్రోకార్బన్లతో కూడిన నీటితో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, పాదరసం వంటి క్యాన్సర్ కారక సమ్మేళనాలను కలిగి ఉండే బొగ్గు బూడిద వ్యర్థాలు ఉండవచ్చని Centers for Disease Control and Prevention అధ్యయనంలో పేర్కొంది.

వ్యాధుల ముప్పు : వరదతో నీటిలో ఉండే ఈ-కొలై వంటి బ్యాక్టీరియా తీవ్ర జీర్ణకోశ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నీరు కళ్లు, చెవుల్లోకి చేరినా తీవ్ర ఇబ్బందికరమే, చిన్నగాయం ఉన్నా బ్యాక్టీరియా చేరుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలతో పాటు కణజాలాన్ని దెబ్బతీసే తీవ్ర చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉందని, అలాగే నీటిలో ఉన్న కీటకాలూ ప్రమాదాలను సృష్టిస్తాయని వివరించారు.
కొర్రమీను రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ మేలు చేస్తుందట! - ఎందుకో తెలుసా?

ఈ ఉరవడి చాలా ప్రమాదం : లోతు తక్కువగా ఉందని వరద నీటితో నిర్లక్ష్యం వద్దని, పారే నీటిలో వాహనం నడపొద్దని redcross అధ్యయనంలో పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో, కొత్త రహదారుల్లో నీరు నిలిచినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వరదల తాకిడికి పాములు, ఎలుకలు కొట్టుకొస్తుంటాయని, అవి బతికి ఉంటే కాటేస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ అవి చనిపోయి ఉంటే కుళ్లిపోయిన కళేబరాలు వ్యాధులకు కారణమవుతాయని, వాటి ద్వారా ఫంగస్ వృద్ధి చెందుతుందని వివరించారు.
వరదనీరు ఇంట్లోకి వస్తే కార్పెట్ల కింద, క్యాబిన్లు, గోడ అంచులు, ఫర్నిచర్, ఫ్యాబ్రిక్‌లపై బూజు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది త్వరగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని, ముఖ్యంగా వృద్ధులు, రోగనిరోధకశక్తి తగ్గిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. వరదలు, వర్షాల సమయంలో దోమలు వాటి గుడ్లు కొట్టుకుపోతాయి. కానీ ఒకటి, రెండు వారాలకు మళ్లీ మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, నీరు నిలిచే బకెట్లు, కొబ్బరి చిప్పలు, మురుగు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.

అడుగేస్తున్నారా? :
- వరద నీటిలో దిగాల్సి వస్తే, లాంగ్ స్లీవ్స్, వాటర్‌ప్రూప్ బూట్లు ధరించాలి.
- చిన్న గాయమైనా సరే నీటిలో అడుగేసే ముందు వాటర్ ప్రూఫ్ బ్యాండేజి వేసుకోవాలి.
- గాయం తడిస్తే వెంటనే సబ్బు, శుభ్రమైన నీటితో శానిటైజ్ చేయాలి. హ్యాండ్ శానిటైజ్, వెబ్ వైప్స్ ఉపయోగించాలి.
- వరద నీటిలో కలుషితమైన దుస్తుల్ని అత్యధిక ఉష్ణోగ్రతలో బ్లీచింగ్ లాంటి క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలి.
- వరద ద్వారా తాగునీటిలోనూ బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే పైపుల్లోకి నీటిని కొంతసేపు ప్రవహించనీయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు "6-6-6 వాకింగ్ రూల్" తెలుసా? - ఇలా చేస్తే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందట!
మీకు "డార్క్ టూరిజం" గురించి తెలుసా? - మనదేశంలో ఈ ప్లేస్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే!

