ETV Bharat / lifestyle

లవ్​లో బ్రేకప్ అయ్యిందా? నెగెటివ్ థాట్స్ నుంచి ఎలా బయటపడాలి? - NEGATIVE THOUGHTS OVERCOME TIPS

ప్రతికూల ఆలోచన నుంచి బయటపడటానికి "5-4-3-2-1" గ్రౌండింగ్ టెక్నిక్ సూచిస్తున్నారు నిపుణులు

Negative_Thoughts_Overcome_Tips
Negative_Thoughts_Overcome_Tips (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : April 13, 2025 at 6:06 PM IST

3 Min Read

Negative Thoughts Overcome Tips : మీ లవ్ బ్రేకప్ అయి తట్టుకోలేకపోతున్నారా? రెండు మార్కుల తేడాతో లక్ష్యాన్ని మిస్ అయి మెదడంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోయిందా? అయితే, ఇలాంటి స్థితిలో ఉన్నవారు "5-4-3-2-1" గ్రౌండింగ్ టెక్నిక్ పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. పంచేంద్రియాలకు వ్యాయామంలా పనిచేసే ఈ సాధన ఒత్తిడి, ఆందోళన నుంచి దృష్టిని మరల్చగలదని వివరిస్తున్నారు. సవాళ్లు ఎన్ని ఎదురైనా ఎదుర్కోగలిగే శక్తినీ పొందొచ్చంటున్నారు. ఇప్పుడు ఈ టెక్నిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చూసి : మీ మెదడు ప్రతికూల ఆలోచనలతో నిండిపోయినప్పుడు కంటి ఎదుట కనిపించే ప్రతి వస్తువునూ నిశితంగా చూడాలి. గాలికి ఎగురుతున్న కిటికీ కర్టెన్, టేబుల్​పై ఉన్న పుస్తకం, నైట్​ల్యాంప్, పెన్, ఇండోర్​ప్లాంట్ ఆకులు, వాటి రంగు ఇవన్నీ రోజూ చూసినవే అయినా కొత్తగా అనిపిస్తాయి. ఇలా అయిదు వస్తువులను గమనించినా మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.

స్పర్శతో : ప్రతికూల ఆలోచనలు ఉన్నప్పుడు స్పర్శ ద్వారా 'నాలుగు' అనుభూతుల్ని పొందాలి. మీ చేతులను చల్లని నీటిలో కానీ గోరువెచ్చని నీటిలో ముంచి చూస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల నీటి ఉష్ణోగ్రత చేతులకు తెలుస్తుంది. కాళ్లకు చెప్పులు లేకుండా నేలపై కాసేపూ, పచ్చగడ్డిలో కాసేపూ నడుస్తూ, ప్రతీ అడుగుపై దృష్టి పెట్టాలి. నేలనూ, గడ్డినీ తాకుతుంటే మీ మనసుకెలా అనిపిస్తోందో తెలుసుకోవాలి. అలాగే మీకు పక్కనే ఉన్న ఏదైనా వస్తువును చేతిలోకి తీసుకుంటే మృదువుగా, గట్టిగా లేదా బరువు తేలిక వంటివన్నీ అనుభూతి పొందుతారు. ఓ ఐస్​ముక్కను అరచేతిలో ఉంచుకుని అది కరగడానికి ఎంత సమయం పడుతుందో, ఆ చల్లదనాన్ని మీరెలా ఫీల్ అవుతున్నారో గమనిస్తే మనసంతా తేలికవుతుందని నిపుణులు అంటున్నారు.

వింటే : చెవులకే కాదు, మనసుకూ వింపుగా ఉంటే 'మూడు' శబ్ధాలను వినాలి. నచ్చిన పాటలో మ్యూజిక్​తో పాటు అందులోని చిన్నచిన్న వాద్యాల సంగీతాన్నీ వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తరచూ విన్న పాటైనా సరే కొత్తగా విన్న అనుభూతిని పొందుతారు. అలాగే బాల్కనీలో పిచ్చుకల సందడిని రెండు నిమిషాల పాటు ఏకాగ్రతతో వింటే అవి మీతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. మీకు బాగా వచ్చిన పాటను ఓసారి హమ్ చేస్తే మీ గొంతు ప్రత్యేకత మీకే తెలుస్తోంది. దీని వల్ల మాటల్లో చెప్పలేని ఆనందం మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మనసును తాకి : మనసు బాగాలేనప్పుడూ వాసన చూడగలిగే 'రెండు' వస్తువులను గుర్తించాలి. దీనికి సంబంధించి మసాలా, పుదీనా, అల్లం వంటి మనసుకు నచ్చిన కాఫీ లేదా టీ చేసుకోవడానికి ప్రయత్నించండి. కాఫీ లేదా టీ మరుగుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే వాసన మీ ముక్కుపుటాలనే కాదు, మనసునూ తాకి హాయిగా అనిపిస్తుంది. బాల్కనీలో పూసిన గులాబీ పరిమళాన్నీ ఎప్పుడైనా దగ్గరి నుంచి ఆస్వాదించారా? కొమ్మ చివర ఊగుతున్న గులాబీ పరిమళానికి మనసును ప్రశాంతంగా మార్చే శక్తి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు

రుచిగా : తినే ఆహారంలో 'ఒక' రుచిని గుర్తించాలి. నచ్చిన పానీయాన్ని మెల్లగా సిప్ చేయడం లేదా ఇష్టమైన ఆహారాన్ని హడావుడిగా తినకుండా ఫుడ్​ను ఎంజాయ్ చేస్తూ తినాలి. అప్పుడే ఆ రుచి అనుభవించినప్పుడే మైండ్ ఫుల్​గా తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడే ఆ రుచి నోటికే కాదు, మనసుకూ ఆనందాన్ని కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నెగెటివ్‌ థింకింగ్ ఎంత ప్రమాదమో తెలుసా? - ఇలా తరిమికొట్టొచ్చు!

వేసవి సెలవుల్లో టూర్ వెళ్తున్నారా? - ఇలా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా వెళ్లిరావచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.