ETV Bharat / lifestyle

ముల్తానీ మట్టి VS శనగ పిండి - ముఖానికి ఏది మంచిదో తెలుసా?

-గ్లోయింగ్ స్కిన్ కోసం ఏది బెటర్‌? - పలు రకాల టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Multani Mitti or shanagapindi
Multani Mitti or shanagapindi (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : October 7, 2025 at 10:36 AM IST

2 Min Read
Choose ETV Bharat

Multani Mitti or Shanagapindi : మనలో చాలా మంది అందంగా కనిపించడానికి మార్కెట్లో లభించే అనేక సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. మరి కొందరు వాటిలో రసాయనాలు ఉంటాయనే ఉద్దేశంతో సహజ సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ముల్తానీ మట్టి, శనగపిండి లాంటివి ఎక్కువగా వాడుతుంటారు. మరి, వీటి వల్ల ఎలాంటి సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!

ముల్తానీ మట్టి ఉపయోగాలు : ముల్తానీ మట్టికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉందని, దీనిని ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా అంటారు. దీన్ని చాలా రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్నీ మృదువుగా చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుందని, మొటిమలు, మచ్చలు తగ్గించడంలో దోహదపడుతుందని తెలిపారు. సన్ టాన్, చికాకు నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుందని తెలిపారు. ముల్తానీ మట్టి జిడ్డుగల చర్మానికి (oily skin) చాలా అనుకూలంగా ఉంటుందని, ఇది చర్మంపై ఉన్న మురికిని, అదనపు నూనెను తొలగిస్తుందని The Open Dermatology Journal జర్నల్​లో ప్రచురించింది. అంతేకాకుండా, ఇది తాజాగా, కాంతివంతంగా, మెరిసే చర్మాన్ని అందిస్తుందని పేర్కొంది.

పిల్లల విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి! - మీకు తెలియకుండా జరుగుతున్నది ఇదే!

శనగపిండి ప్రయోజనాలు : శనగపిండి చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందని World Journal of Pharmaceutical Research అనే జర్నల్ ప్రచురించింది. ముల్తానీ మట్టితో పోలిస్తే శనగపిండి సహజంగా చర్మం మెరిసేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే, ముల్తానీ మట్టి పెట్టడం వల్ల చర్మానికి నిగారింపు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిడ్డు చర్మతత్వం ఉన్న వారు శనగపిండిని వాడాలని సూచిస్తున్నారు. ఇందుకోసం నాలుగు చెంచాల శనగపిండిని ఒక చెంచా రోజ్​వాటర్ లేదా నిమ్మరసం, రెండు చెంచాల తేనె మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఫేస్​కి, మెడకు పట్టించుకోవాలని పేర్కొన్నారు. 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వివరించారు.

రెండిట్లో ఏది మంచిది? : ముల్తానీ మట్టి, శనగ పిండి రెండూ ముఖానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. కానీ, చర్మతత్వం ఆధారంగా వీటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పొడి చర్మం ఉంటే హైడ్రేషన్ కోసం శనగపిండి వాడాలని, అదే ఆయిల్ స్కిన్ ఉన్నవారు మొటిమలు రాకుండా ఉండేందుకు ముల్తానీ మట్టిని అప్లై చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే, ఈ రెండిట్లో ఏది వాడినా, ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని లేకుంటే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

భావోద్వేగాల నియంత్రణలేక బంధానికి బీటలు - ఈ టిప్స్​ పాటిస్తే మేలు జరుగుతుందంటున్న నిపుణులు!

ప్రెగ్నెన్సీ, ప్రసవానంతరం జుట్టులో మార్పు కనిపిస్తోందా? - నిపుణులు ఏమంటున్నారంటే!