ETV Bharat / lifestyle

ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నారా? - మీ అలవాట్లే ఇందుకు కారణమట! - MENTALLY STRONG PEOPLE HABITS

మానసికంగా దృఢంగా ఉండాలనుకుంటున్నారా? - నిపుణులు సమాధానమిదే!

Mentally_Strong_People
Mentally_Strong_People (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : May 24, 2025 at 5:12 PM IST

4 Min Read

Healthy Habits of Mentally Strong People: జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, ఉద్యోగరీత్యా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంటారు. దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడి నిత్యం ఒత్తిడి, ఆందోళనలతో జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ముభావంగా ఉంటుంటారు. అయితే దీనికి భిన్నంగా కొందరు ప్రవర్తిస్తుంటారు. ఎంత ఒత్తిడి అనిపించినా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటూ తమ చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి వాళ్లను చూస్తే ఇంతటి ఒత్తిడిలోనూ వీళ్లు మానసికంగా ఎలా దృఢంగా ఉండగలుగుతున్నారనే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే అందుకు వారి జీవనశైలిలో చేసుకున్న మార్పులు, వారు పాటించే రోజువారీ అలవాట్లే కారణం అని మానసిక నిపుణులు చెబుతున్నారు. మరి వాళ్లలా మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

గతాన్ని మర్చిపోయి : చాలా మంది గత జ్ఞాపకాలు, సంఘటనల్నే తలచుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కానీ మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారని అంటున్నారు నిపుణులు. గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవిస్తూ ప్రతి క్షణాన్ని ఎంత సంతోషంగా, ఎంత విలువైనదిగా గడపాలనే ఆరాటమే వారిని ఎల్లప్పుడూ ఆనందంగా, పాజిటివ్​గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి పరిస్థితులనైనా : ప్రశంసలకు పొంగిపోవడం, సవాళ్లు ఎదురైతే కుంగిపోవడం మానసికంగా బలహీనంగా ఉండే వారి స్వభావం అని నిపుణులు అంటున్నారు. అదే మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమానంగా స్వీకరిస్తారని, కఠిన సవాళ్లు ఎదురైనా వాటిని ఓర్పుతో, నేర్పుతో అధిగమిస్తూ తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తిగా నిలుస్తుంటారని పేర్కొంటున్నారు.

మానసికంగా దృఢమైన వ్యక్తులు
మానసికంగా దృఢమైన వ్యక్తులు (Getty image)

పాజిటివిటీతో : జీవితం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక మార్పు చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలోనే పరిస్థితుల వల్ల వచ్చిన మార్పుల్ని స్వీకరిస్తూ వాటికి అనుగుణంగా మారినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమని చెబుతున్నారు నిపుణులు. మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇలా ఉండడానికే ఇష్టపడతారని తెలుపుతున్నారు. వారి జీవితంలో ఎలాంటి విపత్తు వచ్చిన కూడా అక్కడే ఆగిపోకుండా పాజిటివిటీతో ముందుకు సాగడం వారికి ముందు నుంచే అలవాటని వివరిస్తున్నారు.

సంతృప్తిగా : చాలా మంది ఉన్న దాంట్లో తృప్తిపడరు. ఈ నేపథ్యంలోనే ఇంకా కావాలన్న ఆరాటమే వాళ్ల అసంతృప్తికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. దీంతో వారికి మానసిక ప్రశాంతత లోపిస్తుందని తెలుపుతున్నారు. కానీ మానసికంగా దృఢంగా ఉండే వారు మాత్రం తమకు ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ, సంతృప్తిగా ఉంటారని పేర్కొంటున్నారు.

ఎక్కువగా ఆలోచించి : మానసికంగా దృఢంగా ఉండే వారి ఆలోచనలన్నీ ఎక్కువ శాతం తాము వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎలా ఎదగాలి అన్న దాని పైనే ఎక్కువ దృష్టి పెడతారని నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల వారు ఇతర విషయాల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకునే అవకాశం లేదని, ఇలా ఎదిగే క్రమంలో నిపుణుల వద్ద నుంచి తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరని చెబుతున్నారు.

భవిష్యత్తుపై భరోసా : మానసిక సమస్యలకు ప్రధాన కారణం ఆర్థిక పరమైన అంశాలే! ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే దీర్ఘకాలిక లక్ష్యాలు మేలు చేయడంతో పాటు భవిష్యత్తుపై భరోసాను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఎలాంటి ఒత్తిడి ఉండదని, దీంతో మానసికంగా దృఢంగా ఉంటారని వివరిస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల్ని ఏర్పరచుకోవడంతో పాటు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సవాళ్లను స్వీకరించడం లాంటి నిబద్ధతతో కూడిన జీవనశైలే మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుందని పేర్కొంటున్నారు.

తమకు నచ్చినట్లుగా : చాలా మంది ఏం చేసినా చుట్టూ ఉన్న వారి మెప్పు పొందాలని ఆరాటపడుతుంటారు. కానీ మానసికంగా దృఢంగా ఉన్నవారు మాత్రం ఇతరుల గురించి పట్టించుకోరని, పక్కన ఉన్న వారి జడ్జెమెంట్​తో పనిలేకుండా తమకు నచ్చినట్లుగా తాము ఉండడానికే ఆసక్తి చూపుతారని తెలుపుతున్నారు. ఫలితంగా వారు సంతోషంగా, సంతృప్తికరంగా జీవిస్తారని చెబుతున్నారు.

నేర్చుకోవడానికి : చాలా మంది తమను ఇతరులతో పోల్చుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత దూరం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇతరుల సక్సెస్​ను చూసి అసూయపడకుండా వారిని ప్రశంసించడంలో ముందు ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు వారి నుంచి తెలియని విషయాలు లేదా నైపుణ్యాలు నేర్చుకోవడానికీ సిద్ధంగా ఉండాలని పేర్కొంటున్నారు.

సక్రమంగా పనులు : కొంతమందిలో అనుకున్న పనులు వెంటనే పూర్తి అయిపోవాలన్నా ఆరాటం ఉంటుంది. నిజానికి ఈ ఆతృత మానసిక ప్రశాంతతను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇలాంటి తక్షణ ఫలితాన్ని ఆశించారని పేర్కొంటున్నారు. వారు పూర్తి చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వర్తించి, ఫలితం ఎప్పుడొచ్చినా, ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారని, ఈ పాజిటివిటీనే వారిని అనుక్షణం సంతోషంగా, సంతృప్తికరమైన జీవితం గడిపేలా చేస్తుందని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, మానసిక నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

టైమ్​ లేదని ఇలా చేస్తున్నారా? - జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు!

"పెళ్లికి ముందే ఈ అలవాట్లు" - అమ్మాయిల అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.