"మారథాన్"లో పాల్గొనాలనుకుంటున్నారా? - ఇవి తప్పక పాటించాల్సిందేనట!
- రన్నింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు - వ్యాయామం, పోషకాహారం విషయంలో పలు సూచనలు!

Published : May 17, 2025 at 7:56 PM IST
Marathon Beginner Running Tips : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే వయసుతో సంబంధం లేకుండా వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటివి చేస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి మారథాన్లలోనూ పాల్గొంటున్నారు. ఇలాంటి వాటిల్లో మహిళల సంఖ్య అధికంగా ఉంటుంది. పరుగుల వల్ల కేవలం శారీరంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అయిటే ఫస్ట్ టైం మారథన్లలో పాల్గొనే వారు మాత్రం కొన్ని జాగ్రత్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా మారథన్లలో గాయాల బారిన పడకుండా ఉండవచ్చనని పేర్కొన్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఆరోగ్యంగా ఉన్నారా? : మారథాన్‌లో పాల్గొనే ముందు ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముందు ఓసారి హెల్త్ చెకప్ చేయించుకొని, డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇలా శారీరకంగా సిద్ధపడినప్పుడే గాయాల పాలయ్యే ప్రమాదం తక్కువ ఉంటుందని పేర్కొన్నారు.
లక్ష్యాన్ని పెంచుకుంటూ : మారథాన్‌లో మొదటిసారిగా పాల్గొనేవారు వేగంగా, తొందరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ముందు నుంచే మారథాన్‌కు సిద్ధం కావాలని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకేసారి లక్ష్యానికి గురిపెట్టకుండా కొద్దికొద్దిగా లక్ష్యాన్ని చేరుకునేలా సాధన చేయాలని వివరించారు.

వార్మప్ మర్చిపోవద్దు : వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం, ఇదే నియమం మారథాన్‌కు సిద్ధమయ్యే వారికీ వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం పరుగుకు సిద్ధం అవుతుంది, గాయం ప్రమాదాన్ని తగ్గిస్తుందని Hackensack meridian health పేర్కొంది. అంతేకాకుండా ఆయాస పడకుండా ఉంటారని నిపుణులు తెలిపారు. అయితే వార్మప్‌లో భాగంగా కండరాలు, కీళ్ల సామర్థ్యాన్ని పెంచేలా డైనమిక్ స్ట్రెచెస్ వ్యాయామాలకు ప్రాధాన్యమివ్వడం మంచిదని సలహా ఇస్తున్నారు.

అవి సరిపోవు! : చాలా మంది మారథన్ అంటే వార్మప్ చేసి పరుగు సాధన చేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలంటే వీటితో పాటు స్విమ్మింగ్, సైక్లింగ్, బరువులెత్తే వ్యాయామాలు వంటివి కూడా వర్కవుట్ రోటీన్లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా శరీరంలోని కండరాలు దృఢంగా మారడంతో పాటు పూర్తి ఫిట్‌గా తయారు అవుతాయని వివరించారు. దీని వల్ల మారథాన్ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులువవుతుందని పేర్కొన్నారు.

పోషకాహారం : మారథాన్ విజయవంతం కావడానికి హైడ్రేషన్, పోషకాహారం చాలా ముఖ్యమైనవి ucsfhealth.org పేర్కొంది. ఈ సాధనలో భాగంగా రన్నింగ్ చేయడం వల్ల బాడీలో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతుంటాయంటున్నారు నిపుణులు. అందుకు తగ్గట్టుగా ఆహారం తీసుకుంటేనే శరీరం తిరిగి దృఢంగా, ఉత్సాహంగా మారతుందని వివరించారు. కాబట్టి తీసుకునే ఆహారంలో కూడా మార్పులు, చేర్పులు చేసుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉండేలా ఫ్లాన్ చేసుకోవాలని తెలిపారు. అలాగే డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండేందుకు సరిపడినన్ని నీళ్లు తాగడం కూడా ముఖ్యమని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది
మీరు రాత్రి 10గంటలకు నిద్రిస్తున్నారా! - అయితే, ఏ టైంలో నిద్రలేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
మీ పిల్లలతో బలవంతంగా 'ఇలా' చేయిస్తున్నారా? - అయితే జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు!

