ETV Bharat / lifestyle

రోజంతా తీరికలేని పనులతో అలసిపోతున్నారా? - మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమట!

-మహిళలకు పని ఒత్తిడితో మానసిక సమస్యలు - ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలంటున్న నిపుణులు!

Household Chores Affect Women Health
Household Chores Affect Women Health (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : July 5, 2025 at 11:19 AM IST

3 Min Read
Choose ETV Bharat

Household Chores Affect Women Mental Health: రోజూ ఉదయాన్నే నిద్రలేవడం, ఇంట్లో పనులు పూర్తి చేసి, భర్తకు, పిల్లలకు బ్రేక్​ఫాస్ట్, లంచ్ తయారు చేసి, వారికి క్యారేజ్ సర్దడంతో పాటు తాను బ్యాగు సర్దుకొని ఆఫీసుకు పరుగెత్తడం, సాయంత్రం ఇంటికి చేరడం, మళ్లీ వంట చేసి, అందరూ తిన్న తర్వాత తాను తిని, వంటింట్లో అన్నీ సర్దేసి పనులు ముగించేసి ఎప్పుడో నిద్రపోవడం. ఇదే చాలా మంది మహిళల దినచర్య. ఇలా తీరిక లేకుండా పనిచేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

తీరిక లేని పని : ప్రస్తుతం ఉద్యోగాలు చేసే చాలా మంది మహిళల జీవితాలు శ్వేత జీవితంలానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆఫీసులో 8-9 గంటలు పని చేసి తిరిగి ఇంటికి చేరుకున్నాక తర్వాత వాళ్లు మళ్లీ ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తీరిక లేని బిజిబిజి లైఫ్​లో వాళ్ల అభిరుచులు, ఆరోగ్య సంరక్షణ, వారి కోసం కొంత సమయం కేటాయించుకోవడంలో వెనుకబడిపోతున్నారని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. పురుషుల కంటే స్త్రీలు కనీసం రెండున్నర రెట్లు జీతం లేని ఇంటి, సంరక్షణ పనులను చేస్తారని UN Woman అధ్యయనంలో తేలింది.
యోగా ఏ టైంలో చేయాలి? - ప్రయోజనాలు ఏమిటి? - నిపుణులు ఏం చెబుతున్నారంటే!

గ్రామీణ, పట్టణ మహిళల మధ్య తేడా : పట్టణ మహిళలు ఉన్నత చదువులు, శిక్షణ, సోషలైజింగ్, వినోదానికి సమయాన్ని కేటాయిస్తుండగా, గ్రామీణ మహిళలు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పని మీదే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లుగా పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాకుండా పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళలు రోజూ వారీ ఇంటి పనులకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం : పని ఒత్తిడి వల్ల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. ఎందుకంటే మహిళలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఇంటి పనుల్ని పూర్తి చేస్తుంటారని చెబుతున్నారు. అందుకు కారణం, ఈ పనులన్నీ చేయడం తమ బాధ్యత అనే భావన స్త్రీలను వెంటాడుతుందని తద్వారా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామనే సంగతిని వారు గుర్తించరని వివరిస్తున్నారు. అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు తమ పనిని ప్రశంసించకపోగా ఏదైనా తప్పు ఎత్తి చూపితే వారు తీవ్ర నిరాశకు గురవుతారని చెబుతున్నారు. పైగా ఇంట్లో పనులన్నీ చేయడం తమ విధి అని, ఆ పనులు చేయకపోతే అందరూ ఏమంటారు? కుటుంబంలోని వారు ఏమనుకుంటారు? అనే భయంతో తమపై మరింత ఎక్కువ పని భారాన్ని మహిళలు వేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలక్రమేణా మానసిక ఆరోగ్యంతో పాటు హార్మోన్లను ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

పరిష్కార మార్గాలు : ఈ సమస్య నుంచి బయటపడేందుకు మహిళలు పనిలో సమతుల్యత పాటించడం, ఇంట్లో పనిని ఇతరులతో పంచుకోవడం, అవసరమైతే సహాయకులను నియమించుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఒత్తిడి, నిరాశ ఆవహిస్తే కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, అవసరమైతే మానసిక డాక్టర్లను సంప్రదించడం మంచిదని అంటున్నారు. సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

"తెల్లజుత్తు, ముడతల చర్మం" - అందంగా కనిపించాలని మీరూ అలాగే చేస్తున్నారా?

దోమలతో విసిగిపోయారా? - ఈ టిప్స్ ట్రై చేస్తే హాయిగా నిద్రపోవచ్చట!