53yrs Old Doctor Says her Biological Age is 23 : చాలామంది వయసైపోతోందని బాధపడుతుంటారు. ఆరోగ్యం సహకరించక, ముఖమంతా ముడతలు పడిపోయి తెగ ఆలోచిస్తుంటారు. కొంత మంది పాతికేళ్ల వయస్సులోనే వృద్ధాప్య ఛాయలతో ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు 40 ఏళ్లు పైబడినా యవ్వనంతో ఆకట్టుకుంటారు. అయితే, లండన్ కేంద్రంగా పనిచేసే ఒక లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ మహిళా వైద్యురాలు 53 ఏళ్ల వయస్సులోనూ 23 ఏళ్ల బయోలాజికల్ వయస్సుతో ఆశ్చర్యపరిచారు. శారీరక వయస్సు 53 ఏళ్లయనా జీవసంబంధ వయస్సును (Biological age) 23కి తగ్గించుకోవడం విశేషం. ఈ Biological age కొలవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి.
మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!
"మీ వయస్సు ఎంత?" అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు పుట్టిన తేదీ ఆధారంగా చెప్తుంటారు. కానీ, DNA మిథైలేషన్ మార్పులను పరిశీలించడం ద్వారా బాహ్యజన్యు వయస్సును అంచనా వేయవచ్చు. అదే విధంగా DNAలోని నిర్దిష్ట భాగాలలో జరిగే మిథైలేషన్ మార్పులు, టెలోమీర్ల కణాల చివర్లో ఉండే DNA భాగం, కొన్ని రక్త, మూత్ర నమూనాల్లోని బయోమార్కర్లను కొలవడం ద్వారా జీవసంబంధ వయస్సును అంచనా వేయవచ్చు. కణజాలం వయస్సును పరిశీలించడం ద్వారా జీవసంబంధ వయస్సును అంచనా వేయవచ్చు.

What is Biological Age : వ్యక్తి కణాలు, కణజాలాల ఆరోగ్యం ఆధారంగా బయోలాజికల్ వయస్సు నిర్ణయించవచ్చని, అంతే కాకుండా తక్కువ జీవనసంబంధమైన వయస్సు గుండె, మెదడు, చర్మం వంటి క్లిష్టమైన వ్యవస్థలలో సరైన పనితీరును కనబరుస్తుందని పరిశోధకులు వెల్లడించారు. వృద్ధాప్య స్థాయిని అంచనా వేయడానికి వయస్సుకి (Current Age) ప్రత్యామ్నాయాలుగా జీవసంబంధమైన వయస్సు ఉపయోగ పడుతుందని National Library of Medicine పేర్కొన్నారు.
ఆరోగ్యం అనేది నేర్చుకోవడం, సాధన చేయడం, మెరుగుపరచదగ్గ నైపుణ్యం అని మహిళా వైద్యురాలు తెలిపారు. తన 39వ పుట్టినరోజు తీవ్రమైన బర్న్ అవుట్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురైన తర్వాత ఆమె తన జీవితాన్ని, కెరీర్‌పై దృష్టిని మార్చుకున్నానని వివరించారు. మనిషికి సరైన ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును మొత్తం శ్రేయస్సును సాధించడంలో సహాయపడటానికి 'జీవనశైలి' ప్రధాన కారణమవుతుందని పేర్కొన్నారు.
మహిళా వైద్యురాలు ఏం చేశారంటే!
ఆరోగ్యానికి 6 సూత్రాలివే :
డాక్టర్ తన 53 సంవత్సరాల వయస్సును 23 ఏళ్లకు తగ్గించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. కొన్ని అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం వల్లే తన జీవసంబంధమైన వయస్సును తగ్గించుకున్నానని ఆమె వెల్లడించారు.
- సన్‌షైన్ సింక్ : ప్రతిరోజు ఉదయం ఒక నిమిషం పాటు సూర్యకాంతిని ఆస్వాదించండి. ఆపై 10 సెకన్ల పాటు కళ్లు మూసుకుని మీ రోజు వారి లక్ష్యాన్ని నిర్దేశించుకోమని మహిళా వైద్యురాలు తెలిపారు.
- పవర్ పల్స్ : రోజు 2 నిమిషాలు నడవండి. ఆపై 20 సెకన్ల పాటు వీలైనంత వేగంగా పరుగెత్తమని పేర్కొన్నారు.
- హైడ్రేషన్ హ్యాబిట్ : ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 3 గుటకల నీళ్లు తాగాలని సూచించారు.
- కాంప్లిమెంట్ క్యాటలిస్ట్ : ప్రతిరోజూ ఇతరులకు 4 అభినందనలు ఇవ్వండి, వాటికి 40 సెకన్లు టైం పడుతుందని పేర్కొన్నారు.
- ఫ్లెక్సిబిలిటీ ఫిక్స్ : రోజువారీ పనుల మధ్య 5 చిన్నపాటి వ్యాయామాలను చేర్చుకోవాలని, ప్రతి వ్యాయామానికి 50 సెకన్ల పాటు చేయాలని తెలిపారు.
- బ్రీతింగ్ఫ్లో బూస్ట్ : ప్రతి 60 నిమిషాలకు ఒక నిమిషం పాటు మీ శ్వాసను 6 సార్లు నెమ్మదిగా తీసుకోవాలంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జుత్తు సమస్యలకు "మునగాకు ప్యాక్"! - ఆరోగ్యమే కాదు అందానికీ మంచిదట!
"కళ్లు తిరగడం, కడుపునొప్పి"గా ఉంటోందా? - మీరూ ఈ తప్పు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!