ETV Bharat / lifestyle

"ఉల్లాసోదయానికి సాయం సంధ్యారాగం" - ఇలా అలవాటు చేసుకోవాలంటున్న నిపుణులు!

ఉదయం వీలు కావట్లేదా? - సాయంత్రం ఇలా ట్రై చేయాలంటున్న నిపుణులు!

Evening Habits
Evening Habits (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : October 13, 2025 at 2:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Benefits of Positive Evening Habits : ఉదయం త్వరగా లేవండి, ధ్యానం చేయండి, వ్యాయామం చేయండి, ఆరోగ్యకరమైన బ్రేక్​ఫాస్ట్ తీసుకోండి తరచూ ఇలాంటి ఉదయరాగాలే మనం వింటుంటాం. ఉదయాన్నే కాదు, సాయంత్రం సంధ్యారాగాలూ మధురాలే అంటున్నారు నిపుణులు. మరుసటి రోజును తీర్చిదిద్దే సాయంత్రాలూ కీలకమని చెబుతున్నారు. మరి, ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

వేలాది వ్యాసాలు, వీడియోలు, పాడ్​కాస్ట్​లు ఇవన్నీ 'విన్నింగ్ మార్నింగ్​ రొటీన్​' గురించి చర్చిస్తుంటాయి. ఉదయం ఎలా ప్రారంభించాలో, ఏ పనులు చేయాలో, ఏం చేయకూడదో వాటి గురించి మాత్రమే చెబుతుంటారు. కానీ, సాయంత్రం నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు, మనం చేసే పనులు మరుసటి రోజుపై ఎంతో ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.

మనసు తేలికగా : రోజంతా మన మెదడు ఎన్నో విషయాలను శోషించుకుంటుంది. దీంతో రాత్రికి ఎన్నో ఆలోచనలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి గందరగోళానికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. తద్వారా నిద్రకూ భంగకరంగా మారొచ్చని అంటున్నారు. ఈ సమస్యను నివారించేందుకు ఒక చిన్న నోట్​బుక్ లేదా నోట్స్ యాప్ తీసుకుని 'రేపు చేయాల్సిన పనులు', 'ఈ విషయం మార్చిపోవద్దు' లాంటి విషయాలను రాయలని సూచిస్తున్నారు. ఈ పనులు మెదడును తేలిక పరుస్తుందని సలహా ఇస్తున్నారు.

ప్రెగ్నెన్సీ, ప్రసవానంతరం జుట్టులో మార్పు కనిపిస్తోందా? - నిపుణులు ఏమంటున్నారంటే!

షట్​డౌన్ : నిద్రకు కనీసం 2 గంటల ముందు భోజనం పూర్తి చేయాలని అంటున్నారు. అలాగే, డిజిటల్ కట్​ ఆఫ్ టైమ్​ను ఫిక్స్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎలాగంటే, రాత్రి 9 తర్వాత గ్యాడ్జెట్స్​తో లేకుండా ఉండడం. ఇది శరీర, కంటి ఆరోగ్యానికే కాకుండా, మంచి నిద్రకు సాయపడుతుందని పేర్కొంటున్నారు.

1-3-5 విధానం : అస్పష్టత మనపై ఒత్తిడి పెంచడంతో పాటు శక్తిని, సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పనులను పూర్తి చేసేందుకు 1-3-5 విధానం సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఈ విధానంలో 1 - ముఖ్యమైంది, 3- మధ్యస్థాయి టాస్కులు, 5- చిన్న చిన్న పనులు పూర్తి చేయడం. ఇలా చేయాల్సిన పనిని విభజించుకుంటే సులభం అవుతుంది. మనసుకు దిశ, లక్ష్యం ఇస్తే.. అది అనుసరించే మార్గం సృష్టంగా ఉంటుందని చెబుతున్నారు.

క్లీన్​గా : పొద్దున్నే శుభ్రమైన వాతావరణం ఉంటే, మన రోజు శక్తివంతంగా ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ ఓ పదినిమిషాలు 'క్లీనప్​ టైం'గా కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. వంటగదిని శుభ్రపరచడం, సోఫా మీద వేసిన బట్టలు సర్దడం, టేబుల్ మీద ఉన్న చెత్తను తొలగించడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.

ఆహారం ముందే : ఉదయాన్నే ఏం వండుకోవాలి? ఏం తినాలి అని చాలామంది గాబరాపడిపోతుంటారు. అందుకే, ముందురోజే ఈ ప్రణాళిక ఆలోచించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు తరిగి ఫ్రిజ్​లో పెట్టుకోవడం, డ్రైఫ్రూట్స్​ను ఓ ప్యాకెట్​లో పెట్టడం మొదలైనవి ముందే చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఓ శ్వాస హాయిగా : ఇది నిద్రించే సమయం అంటూ శరీరానికి సంకేతం అందించాలంటున్నారు. ఈ క్రమంలో ఓ రెండు నిమిషాలు శాంతంగా నిలబడి, 4-7-8 శ్వాస పద్ధతిని పాటిస్తూ, స్ట్రెచింగ్ చేయాలని వివరిస్తున్నారు. అంటే, 4 సెకన్లు శ్వాస లోపలకి తీసుకొని, 7 సెకన్లు పాటు నిలిపి, 8 సెకన్లు వదిలేయాలని సూచిస్తున్నారు. ఈ రూల్ ఒత్తిడిని దూరం చేసి, శరీరంలో కొత్త శక్తిని నింపుతుందని తెలియజేస్తున్నారు.

వేసుకునే దుస్తులు : మనలో చాలా మంది ఏ దుస్తులు ధరించాలన్న విషయాన్ని సగటున 15 నిమిషాల పాటు ఆలోచిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. అందుకే పొద్దున్నే వేసుకునే డ్రెస్, షూ, జిమ్ డ్రెస్ అన్నీ ముందే సిద్ధం చేసుకుంటే సమయం ఆదా అవుతుందని, ఏ హడావుడి లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఓ మంచి పని : ఆ రోజు చేసిన ఒక మంచి పని గురించో, సాధించిన విజయం గురించో కాగితం మీద రాయండి. ఇతరులను ప్రశంసించడం, ఎవరికైనా సాయం చేయడం, ఎదుటివారి అవసరాలను తీర్చడం ఇలా ఏదైనా సరే, మనలో సంకల్ప బలాన్ని పెంచడంతో పాటు, మనసుకు ప్రశంసనిచ్చినట్టవుతుందని అంటున్నారు నిపుణులు.

సోషల్ మీడియాలో చూసి బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ముల్తానీ మట్టి VS శనగ పిండి - ముఖానికి ఏది మంచిదో తెలుసా?