ETV Bharat / lifestyle

వారంలో ఒక్క రోజు 'మ్యాజిక్ నైట్' - పిల్లల జ్ఞాపకాలకు ఇలా 'యస్' చెప్పేద్దాం!

-పిల్లలకు వెరైటీ ఎంజాయ్​మెంట్ ​- ఇలా చేస్తే సృజనాత్మకత మెరుగవుతుందని నిపుణుల సూచనలు!

Childhood_Memories
Childhood_Memories (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : June 14, 2025 at 9:44 AM IST

2 Min Read
Choose ETV Bharat

Childhood Memories: బాల్యాన్ని అందమైన జ్ఞాపకంగా మార్చేది ఆ వయస్సులో చేసిన పనులే. అవే పిల్లలకి జీవిత విలువలు, నడవడికను నేర్పించడంతో పాటు అంతులేని ఆనందాల్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు బలమైన బంధాలు ఏర్పడడానికీ బాటలు వేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి, అలాంటి జ్ఞాపకాలను పిల్లలకు అందించాలంటే తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

వారానికి ఓ సాయంత్రం : పిక్నిక్, పార్క్ వంటివి పిల్లలు ఎప్పుడూ ఇష్టపడతారు. కానీ, ఈ సారి అలా కాకుండా కుటుంబమంతా కలిసి వీక్ ఎండ్​లో ఓ 'మ్యాజిక్ నైట్'ను ఏర్పాటు చేసుకోమని నిపుణులు చెబుతున్నారు. అంటే, డిమ్ లైట్లలో పైజమాలు ధరించి, సరదాగా నచ్చినవి తింటూ కథలు చెప్పుకోవడం. ఇలా వారానికి ఒక్కసారి పిల్లలతో చేయగలిగినా వారిలో సృజనాత్మకత, ఊహాశక్తి వంటివి పెరుగుతాయని పేర్కొంటున్నారు.

పిల్లల జ్ఞాపకాలు
పిల్లల జ్ఞాపకాలు (Getty image)

నిద్రపోయే ముందు : ప్రతిరోజూ పిల్లలు పడుకునే ముందు ఊరికే జోకొట్టి నిద్ర పుచ్చడం కంటే ఆ రోజు వాళ్లకు స్కూల్లో ఎలా గడిచింది? సరదా సంగతులేమైనా ఉన్నాయా? లంచ్ టైమ్​లో ఎలా ఎంజాయ్ చేశావ్ లాంటి విషయాలు అడగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి విషయాలు వారి మనసులోని రకరకాల భావాలను బయటపెట్టే అవకాశం ఉందని, ఇలా పిల్లలు విషయాలు పంచుకోవడం వల్ల వాళ్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా పెరగడంతో పాటు కృతజ్ఞతాభావమూ పెంపొందుతుందని వివరిస్తున్నారు.

పిల్లల జ్ఞాపకాలు
పిల్లల జ్ఞాపకాలు (Getty image)

రొటీన్ వద్దు : రెండు లేదా మూడు నెలలకోసారైనా రొటీన్​కు భిన్నంగా చేసేలా ఓ రోజును కేటాయించుకోవాలంటున్నారు నిపుణులు. అంటే వెనకకు నడవడం, వాక్యాలు రివర్స్​లో చదవడం, దుస్తులు తిప్పి వేసుకోవడం ఇలా సరదాగా పిల్లలతో చేయించాలని, వారితో పాటు పేరెంట్స్​ చేయాలని సూచిస్తున్నారు. ఇవన్నీ పిల్లల్లో క్రియేటివిటీ, సమయస్ఫూర్తి, చతురతలను పెంచుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పనులన్నింటినీ ఫొటోలు తీసుకోవాలని, అవే తర్వాత మంచి జ్ఞాపకాల్లా అనిపిస్తాయని పేర్కొంటున్నారు.

పిల్లల జ్ఞాపకాలు
పిల్లల జ్ఞాపకాలు (Getty image)

'యస్' అనేయండి : 'ఐస్​క్రీమ్​ కొనిస్తావా అమ్మా' అని పిల్లలు అడిగినప్పుడు మీరు ఎస్​ చెప్తే వాళ్లు ఎగిరి గంతేస్తారు, అలాంటిది ఓ రోజంతా వాళ్లకు నచ్చినట్లే చేస్తే వాళ్లు చాలా సంతోషిస్తారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, అప్పుడప్పుడూ ఒక రోజులో ఏమేం చేయాలో పిల్లలనే ప్లాన్ చేయమని చెప్పాలని పేర్కొంటున్నారు. అంటే ఆ రోజు తినే ఆహారం, డ్రెస్ కోడ్, యాక్టివిటీలు, నచ్చిన చోటుకి వెళ్లడం లాంటి వాటన్నింటికీ 'యస్' చెప్పాలని సూచిస్తున్నారు. ఫ్లానింగ్ స్కిల్స్ పెరగడానికి, కొత్త కొత్త ఆలోచనలు రావడానికి ఇలాంటి అలవాట్లు దోహదపడడంతో పాటు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి అలవాటుపడుతుందని తెలుపుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

సమ్మర్​లో పిల్లలు సమయానికి తినట్లేదా? - అలా అనకండి, ఇలా చెప్పండి - ప్లేట్లు ఖాళీ చేస్తారు!

మీ పిల్లలతో బలవంతంగా 'ఇలా' చేయిస్తున్నారా? - అయితే జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు!