Herbal Teas That Help Improve Lung Health : చాలా మంది తమ రోజువారీ జీవితాన్ని టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. అయితే కొందరు రోజులో అనేక సార్లు వీటిని తాగుతుంటారు. కానీ, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, సాధారణ టీకి బదులుగా హెర్బల్ టీలు తీసుకోవడం మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీలో ఉండే కెఫెన్ హెర్బల్ టీలో ఉండదని, పైగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని అంటున్నారు. మరి, అలాంటి హెర్బల్ టీల రకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పెప్పర్ మింట్ టీ : పుదీనా టీలో ఉండే గుణాలు నాసికా కుహరాలు, శ్వాస నాళాలను శుభ్రం చేయడంలో దోహదపడుతాయని తెలిపారు. తద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు. ఇందులోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అల్లం టీ : వేడివేడి అల్లం టీ తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గడంతో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. దీనిపాటు ఊపిరితిత్తులు డీటాక్సీఫై అవుతాయని నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండటం వల్ల శ్వాసకోశ వాపు తగ్గించడంతో పాటు శ్వాసరేటు మెరుగుపరచడానికి అల్లం టీ ఉపయోగపడుతుందని తెలిపారు.

థైమ్ టీ : థైమ్‌లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను డీటాక్సిఫై చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది శ్లేష్మాన్ని తొలగించి దగ్గు, జలుబు సమస్య నుంచి ఉపశమనం కలిగిచడంతో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దోహదం చేస్తుందని 'జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్ లైఫ్' లో ప్రచురించింది.
యూకలిప్టస్ టీ : యూకలిప్టస్ ఆకుల్లో సహజంగానే సినోల్ కలిగి ఉంటుంది. ఇది శ్లేష్మాన్ని తగ్గించడంలో, శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యూకలిప్టస్ శ్వాసకోశ పరిస్థితులను ప్రభావవంతమైన నివారణకు దోహదపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

ముల్లియన్ టీ : ముల్లియన్ను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ముల్లియన్ టీ తాగడం వల్ల ఊపిరితిత్తులు డీటాక్సిపై అవుతాయి. దీంతో పాటు శ్లేష్మం కూడా తొలగిపోతుంది
పసుపు టీ : పసుపులోని యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్పెక్షన్లతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. దీనిలోని యాంటీ ఇంప్లమేటరీ గుణాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి. ఇందులో శ్వాసకోశ వాపును తగ్గించే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయని 'జర్నల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్'లో ప్రచురించింది. ఇందులో ఉన్న సహజ గుణాల కారణంలో సీఓపీడీ (COPD) రోగుల్లో ఊపిరిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.
లికోరైస్ రూట్ టీ : లికోరైస్ రూట్ టీలో సహజంగా చర్మాన్ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. దీంతో పాటు ఇది చికాకు కలిగించే కణజాలాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నాయని పలు అధ్యయానాల్లో తేలింది. దీని వల్ల శ్వాసకోశ పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు.
గ్రీన్ టీ : గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల్లో వచ్చే వాపును తగ్గించే సామర్థాన్ని కలిగి ఉంటాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు బాగా ఉండడంతో పాటు లంగ్ క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది.

తులసి టీ : ఆయుర్వేదంలో తులసి టీని జీవితానికి అమృతంగా పరిగణిస్తారు. దీని వల్ల అనేక శ్వాసకోశ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇది శ్వాసకోశ వాపును తగ్గించడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని 'జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ'లో ప్రచురించింది. ఇందులో ఉన్న ఔషధ గుణాలు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'షుగర్' పెరిగితే ఏ అవయవానికి ఎలాంటి నష్టమో తెలుసా? - రిపోర్టులు ఏం చెప్తున్నాయంటే!
ఉదయాన్నే 'ఈ లక్షణాలు' కనిపిస్తున్నాయా? - 'డయాబెటిస్' కావచ్చంటున్న వైద్యులు!