ETV Bharat / international

'30 రోజుల్లో స్వతాహగా దేశం విడిచి వెళ్లిపోండి'- వారికి అమెరికా వార్నింగ్​ - US DEPORTATION ROW

అవసరమైతే ఫ్లైట్ టికెట్లపై రాయితీ ఇస్తామని వెల్లడి- అక్రమ నివాసితులకు అమెరికా మరోసారి హెచ్చరిక

us deportation row
us deportation row (ANI, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2025 at 4:56 PM IST

1 Min Read

US Deportation Row: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు తక్షణమే స్వతహాగా దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఆ దేశం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. విమాన టికెట్‌ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. అమెరికాలో 30 రోజులకు మించి ఎక్కువకాలం నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తారు. అందుకే అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారు స్వతహాగా దేశం విడిచిపెట్టాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఎక్స్‌లో సందేశం ఉంచింది.

5000 డాలర్ల వరకు ఫైన్‌
సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గమని తెలిపింది. సామాను సర్దుకొని విమానం ఎక్కాలని, ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకొన్న సొమ్మును దాచుకొని బయల్దేరాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వెల్లడించింది. ఇలాంటి వారు విమాన టికెట్‌ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేసింది. ఈ నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపిచేస్తామని అమెరికా పేర్కొంది. అంతేకాకుండా ఫైనల్‌ ఆర్డర్‌ అందుకొన్న వారు ఒక్క రోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్లు జరిమానా, సొంతంగా వెళ్లిపోకపోతే 1,000 నుంచి 5000 డాలర్ల ఫైన్‌ విధించనున్నారు. జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని. వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని చెప్పింది.

వారిపై ఈ ప్రభావం పడదట
ఈ నిర్ణయం నేరుగా హెచ్‌1బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. కానీ, సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా అమలు చేయనున్నారు. ఎవరైనా హెచ్‌1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థి, హెచ్‌1బీ వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.