US Visa Restrictions : అమెరికాకు అక్రమ వలసలను ప్రోత్సహించే వారిపై అగ్రరాజ్యం సీరియస్ అయ్యింది. భారత్ కేంద్రంగా పనిచేసే పలు ట్రావెల్ ఏజెన్సీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అక్రమ రవాణా కార్యకలాపాలను సహకరించిన వారిని గుర్తించేందుకు మిషన్ ఇండియా కౌన్సిలర్ వ్యవహారాలు- దౌత్య భద్రతకు సంబంధించి కాన్సులేట్ చురుగ్గా ఉంటుందని విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
'మా ఇమ్మిగ్రేషన్ విధానం ప్రకారం, అమెరికాకు అక్రమ వలసల వల్ల జరిగే ప్రమాదాల గురించి విదేశీ పౌరులకు తెలియజేయడమే కాకుండా, వాటిని సులభతరం చేసిన వారిని చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను జవాబుదారులుగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకుంది' అని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలోతోపాటు విధానాలను అమలు చేయడం, అమెరికన్లను రక్షించడానికి చాలా కీలకమని పేర్కొంది.
వీసా పరిమితి విధానం ప్రపంచవ్యాప్తమని చెప్పింది. అమెరికా వీసా ఆంక్షలు విధించిన ట్రావెల్ ఏజెన్సీలు, వ్యక్తుల గురించి అడిగ్గా, దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ అధికారి వివరాలను అందించలేమని అన్నారు. గోప్యత కారణంగా వీసా ఆంక్షలు విధించడానికి యునైటెడ్ స్టేట్స్ చర్యలు తీసుకుంటున్న వ్యక్తులు లేదా ట్రావెల్ ఏజెన్సీల జాబితాను విడుదల చేయలేమని చెప్పారు.