Trump Vs Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎ క్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఎప్సిటీన్ ఫైల్స్‌లో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు.
Time to drop the really big bomb:@realDonaldTrump is in the Epstein files. That is the real reason they have not been made public.
— Elon Musk (@elonmusk) June 5, 2025
Have a nice day, DJT!
ఇంతకీ ఎప్సిటీన్ ఫైల్స్ అంటే ఏమిటి?
బాలల లైంగిక వేధింపుల కేసులో జెఫ్రీ ఎప్టిటీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సంపన్నులకు యువతులను, బాలికలను అక్రమంగా రవాణా చేసేవాడని ఎప్సిటీన్పై ఆరోపణలు ఉన్నాయి. దీనితో అతని సన్నిహితులు, క్లయింట్లకు సంబంధించిన డేటాను 'ఎప్సిటీన్ ఫైల్స్' అంటున్నారు. ఈ ఫైల్స్‌లో ట్రంప్ పేరు కూడా ఉందని తాజాగా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు.
నా మద్దతు లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు: మస్క్
మస్క్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య వైరం మరింత పెరుగుతోంది. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని ఎలాన్ మస్క్ అన్నారు. 'నేను లేకుంటే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్‌లో రిపబ్లికన్లు 51-49 మంది మాత్రమే ఉండేవారు' అని మస్క్ పేర్కొన్నారు.
పెరుగుతున్న వైరం!
ఇంతకు ముందు ట్రంప్, మస్క్‌పై పలు వ్యాఖ్యానాలు చేశారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అన్నారు. అంతేకాదు, తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకున్నా పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. అక్కడితో ఆగకుండా, ఎలాన్ మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీనితో మస్క్ తనదైన రీతిలో ఎక్స్ వేదికగా చెలరేగిపోయారు. 'కొత్త పార్టీ పెట్టవచ్చా?' అని అభిమానులను ప్రశ్నించారు. '80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?' అని అడిగారు.
వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు ప్రచారం చేశారు. వీరిద్దరి మధ్య సంబంధాలు ఇటీవలి వరకు బాగానే ఉన్నాయి. కానీ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి.
మా తలలపై తుపాకీ గురిపెట్టిన వారితో చర్చలు ఉండవు : శశిథరూర్
ఇకపై ఆ 12 దేశాల వారికి అమెరికాలోకి నో ఎంట్రీ- ట్రంప్ కీలక నిర్ణయం