Trump on Iran Israel War : ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి ప్రవేశించేందుకు అమెరికా రంగం సిద్ధం చేసుకుంటోంది. అణు కార్యక్రమాన్ని బూచిగా చూపి ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే అంశంపై రెండు వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇరాన్‌తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన పరిష్కారానికే ట్రంప్ సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ దేశం అణ్వాయుధం సంపాదించకుండా నిరోధించడమే అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని ఆమె తెలిపారు.
ఇరుదేశాల మధ్య ఒప్పందం అనేది టెహ్రాన్ యురేనియం సుసంపన్నతను నిషేధించడం, అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తగ్గించడంపైనే ఉంటుందని కరోలిన్ లీవిట్ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ ఎల్లప్పుడూ దౌత్యపరమైన పరిష్కారం కోసమే ఆలోచిస్తారని, ఆయన ప్రధాన శాంతికర్త అని తెలిపారు. ఆయన బలం ద్వారా శాంతిని నెలకొల్పే అధ్యక్షుడని, ఏ సమస్యకైనా దౌత్య పరిష్కారం ఉంటే దాన్నే ఆయన ఎంచుకుంటారని అన్నారు. అయితే అవసరమైన సమయంలో ఆయన తన బలాన్ని ఉపయోగించేందుకు భయపడరని ఆమె పేర్కొన్నారు.
VIDEO | Washington: Briefing the reporters over Israel-Iran conflict, White House Press Secretary Karoline Leavitt (@PressSec) said, " regarding the ongoing situation in iran and the president's decision making that whether or not the united states will be directly involved, there… pic.twitter.com/1xmkHZj9lp
— Press Trust of India (@PTI_News) June 19, 2025
#WATCH | Washington, DC | White House Press Secretary Karoline Leavitt quotes President Donald Trump as saying, " ... based on the fact that there is a substantial chance of negotiations that may or may not take place with iran in the near future, i will make my decision, whether… pic.twitter.com/qaAt0rETV3
— ANI (@ANI) June 19, 2025
స్పందించిన రష్యా
మరోవైపు అమెరికా సైనిక చర్య వార్తలపై రష్యా స్పందించింది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోని ప్రధాన ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తాము అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంటే, వాళ్లు మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రగులుతున్న పశ్చిమాసియా- స్ట్రాంగ్‌గా ఉండాలని ఇరాన్ ప్రజలకు ఖమేనీ పిలుపు!
'ఎవరికీ మినహాయింపు లేదు, ఎవరినీ వదలొద్దు'- నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు