ETV Bharat / international

ఇకపై ఆ 12 దేశాల వారికి అమెరికాలోకి నో ఎంట్రీ- ట్రంప్ కీలక నిర్ణయం - TRUMP TRAVEL BAN

12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపిన ట్రంప్

Trump Travel Ban
Trump Travel Ban (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : June 5, 2025 at 7:39 AM IST

2 Min Read

Trump Travel Ban : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్​ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు జూన్​ 9(సోమవారం) నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. కొలరాడోలో యూదు సమూహంపై ద్రావణ సీసాలతో ఓ వ్యక్తి దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్థాన్‌, ఇరాన్‌, యెమెన్‌, మయన్మార్‌, చాడ్‌, కాంగో రిపబ్లిక్‌, ఈక్వటోరియల్‌ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్‌ దేశాలపై ట్రంప్ నిషేధం విధించారు. పాక్షికంగా నిషేధం విధించిన మరో ఏడు దేశాల జాబితాలో బురుండి, క్యూబా, లావోస్‌, సియోర్రా లియోన్‌, టోగో, తుర్క్‌మెనిస్థాన్‌, వెనిజులా ఉన్నాయి. దేశ భద్రతను, అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడటానికి కోసమే ఈ చర్య తీసుకోవల్సి వచ్చిందని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

'కొలరాడోలోని బౌల్డర్‌లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరప్‌లో జరిగిన విధంగా మన మాతృభూమిలో జరగనివ్వను. అందుకే సురక్షితం కానీ దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేం. యెమెన్‌, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా' అని ట్రంప్ తెలిపారు.

ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. 2017లో ఇరాన్‌ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణ నిషేధం విధించారు. 2018లో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇక, 2023లోనూ ట్రంప్‌ ఈ ప్రణాళికల గురించి ప్రస్తావించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే గాజా స్ట్రిప్‌, లిబియా, సోమాలియా, సిరియా యెమెన్‌ వంటి దేశాల నుంచి పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తానని గతంలో తెలిపారు. దేశ భద్రతకు ముప్పు అని భావించేవారిని అమెరికాలోనికి ఎన్నటికీ రానివ్వబోమని పేర్కొన్నారు.

కాగా, ట్రంప్ ప్రకటనపై వెనిజువెలా మంత్రి డియోస్టాడో కాబెల్లో స్పందించారు. యూఎస్‌లో ఉండటం వెనిజువెలా ప్రజలకు మాత్రమే కాదు, ఎవరికైనా ప్రమాదమే అని వ్యాఖ్యానించారు. అందుకే తమ దేశ పౌరులు అగ్రరాజ్యంలో పర్యటించవద్దని సూచనలు ఇచ్చారు. అయితే ట్రంప్‌ చేసిన ఈ ప్రయాణ నిషేధానికి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.