ETV Bharat / international

పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌ కాల్​- ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని విస్తరించొద్దని సూచన!

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని విస్తరించొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరిన ట్రంప్!

Trump Putin
Trump Putin (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 10:13 AM IST

Updated : Nov 11, 2024, 11:11 AM IST

Trump Call To Putin : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్​తో ఫోన్​లో మాట్లాడారు. ఉక్రెయిన్​తో యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. గత గురువారం ఫోర్లిడాలోని తన ఎస్టేట్‌ నుంచి ట్రంప్‌ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సదరు కథనం వెల్లడించింది. ఐరోపాలో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్‌ గుర్తుచేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ యుద్ధంపై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు సూచించినట్లు తెలిపింది.

అయితే తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగానే ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. తాను యుద్ధాన్ని ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ భరోసానిచ్చారు. ఈ కాల్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా జెలెన్‌స్కీతో మాట్లాడారు.

ఇక, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు ఇటీవల పుతిన్‌ అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు రష్యా అధినేత బదులిచ్చారు. ట్రంప్‌ ధైర్యవంతుడని, ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఉక్రెయిన్‌ వివాదానికి 24 గంటల్లో ముగింపు పలకగలనన్న ట్రంప్ వాదనను గతంలో క్రెమ్లిన్‌ స్వాగతించింది. ఈ పరిణామాల వేళ తాజాగా వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల, ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడం, అమెరికాతో సంబంధాల పురోగతిపై పుతిన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారంగా పేర్కొంది. రష్యాతో తమది నవశక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించుకుంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని పుతిన్‌ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మాట్లాడారు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై చైనా వైఖరి స్పష్టంగా ఉందని తెలిపారు. రాజకీయ పరిష్కారానికి అవసరమైన అన్ని ప్రయత్నాలకు మద్దతిస్తామన్నారు. ఇదే సమయంలో చైనా, రష్యాలను కట్టడి చేసేందుకు అమెరికా పాటించే ద్వంద్వ విధానంపై పుతిన్‌ విమర్శించడాన్ని ప్రశంసిస్తున్నామని చెప్పారు.

Last Updated : Nov 11, 2024, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.