Trump on Elon Musk: అమెరికా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ రూట్ మార్చారు. ఇప్పటివరకూ పూర్తి స్వేచ్ఛనిచ్చిన ట్రంప్, తొలిసారి అందుకు భిన్నంగా స్పందించారు. మస్క్‌కు ఉన్న వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఆయనతో అమెరికా యుద్ధ ప్రణాళికలను పంచుకోకూడదని వెల్లడించారు. మస్క్‌కు చైనాలోనూ వ్యాపారాలున్నాయని, కాబట్టి ఆయన ప్రభావితం కావొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అధికారులు యుద్ధ తంత్రాలకు సంబంధించిన కొన్ని రహస్య ప్రణాళికలను మస్క్‌కు వివరించనున్నట్లు న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనం చర్చనీయాంశమైన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'మస్క్‌కు ఆ ప్లాన్లు చెప్పలేదు'
డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(డోజ్) సారథిగా ఉన్న మస్క్ శుక్రవారం పెంటగాన్‌కు వెళ్లారని, అక్కడ నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంపై మాత్రమే ఆయన చర్చించారని ట్రంప్ వివరించారు. చైనాతో యుద్ధం వస్తే అమెరికా ఎలా ఎదుర్కోవాలో తెలిపే ప్రణాళికలను మస్క్‌కు అధికారులు వివరించలేదని క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు పెంటగాన్‌కు చేరుకున్న మస్క్‌కు అక్కడి అధికారులు స్వాగతం పలికారు.
#WATCH | US Department of Government Efficiency (DOGE) chief Elon Musk visited the Pentagon
— ANI (@ANI) March 21, 2025
US Secretary of Defence Pete Hegseth tweets, " amazing visit with elon musk at the pentagon today. he is a patriot, and i look forward to continuing our work together. with elon and doge,… pic.twitter.com/tSa8HcnQ2P
టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలు : ట్రంప్ వార్నింగ్
మరోవైపు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా విద్యుత్ కార్ల సంస్థ ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేందుకు మంచి అవకాశం ఉందని ట్రంప్ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ఈ దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లతోపాటు కార్ల పైనా ఇటీవల దాడులు జరిగాయి. భద్రత కరవైందన్న కారణంగా కెనడాలో అంతర్జాతీయ వాహన ప్రదర్శన నుంచి టెస్లా తన ఉత్పత్తులను వెనక్కి తీసుకుంది. మస్క్‌ను ప్రభుత్వ సామర్థ్య పెంపుదల విభాగం (డోజ్) అధినేతగా ట్రంప్ నియమించినప్పటి నుంచీ టెస్లాపై దాడులు పెరిగాయి.
చైనాతో యుద్ధం వస్తే ఏం చేద్దాం? పెంటగాన్ రహస్యాలు మస్క్‌కు! ఫేక్ న్యూస్ అంటూ ట్రంప్ రిప్లై
నిన్న పుతిన్‌తో- నేడు జెలెన్‌స్కీతో- డొనాల్డ్ ట్రంప్ వరుస చర్చలు!