ETV Bharat / international

హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్ షాక్- 2.2 బిలియన్​ డాలర్ల కోత - HARVARD UNIVERSITY FUNDING CUT

హార్వర్డ్‌ యూనివర్సిటీ నిధులకు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం- 2.2 బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులకు కత్తెర

Harvard University Funding Cut
Harvard University Funding Cut (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : April 15, 2025 at 9:56 AM IST

1 Min Read

Harvard University Funding Cut : హార్వర్డ్‌ యూనివర్సిటీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం షాకిచ్చింది. ట్రంప్ సర్కార్​ జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించడం వల్ల ఆ​ విశ్వవిద్యాలయానికి అందించే 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను స్తంభించేసింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయానికి సంబంధించిన 60 మిలియన్ డాలర్ల ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపివేసినట్లు వైట్​హౌస్​ పేర్కొంది.

హార్వార్డ్‌ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్ మాస్క్​లను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్​ నేతృత్వంలోని పరిపాలన విభాగం శుక్రవారం ఓ లేఖను పంపించింది. పాలస్తీనా అనకూల నిరసనలను అణచివేసేందుకు ఈ నిబంధనలను జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన హార్వర్డ్ విశ్వవిద్యాయలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా విశ్వవిద్యాలయాల్లో ఏమి భోదించాలి, ఎవరిని చేర్చుకోవాలి, నియమించుకోవాలి లేదా ఏ రంగాలను ఎంచుకోవాలో నిర్దేశించకూడదని తెలిపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రభుత్వం, హార్వర్డ్‌కు అందే నిధులను స్తంభింపజేయాలని నిర్ణయించింది.

పౌర హక్కులను ఉల్లంఘించారనే ఇప్పటికే కొలంబియా, పెన్సిల్వేనియాతో సహా కార్నెల్‌, నార్త్‌ వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయాలకు అందించే నిధులను ట్రంప్‌ సర్కార్ నిలిపివేసింది. అయితే, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో యూదు విద్యార్థులకు రక్షణ ఉండాలని, వారికి విద్య, క్యాంపస్‌ వసతులు అవిచ్ఛిన్నంగా అందుబాటులో ఉండాలని ఫెడరల్‌ చట్టం నిర్దేశిస్తోంది. దీన్ని అమలుచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ గత నెలలో విద్యాశాఖ 60 విశ్వవిద్యాలయాలకు లేఖ రాసింది.

హమాస్‌పై ఇజ్రాయెల్‌ పోరును నిరసిస్తూ గతేడాది జరిగిన ప్రదర్శనలకు ఎలా అనుమతులు ఇచ్చారని అమెరికన్‌ విశ్వవిద్యాలయాలను ట్రంప్‌ ప్రభుత్వం నిలదీసింది. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో మొదలైన ఈ నిరసనలు ఇతర విశ్వవిద్యాలయాల ప్రాంగణాలకూ విస్తరించాయి. పరిశోధన కార్యక్రమాలకు, వైద్య కేంద్రానికీ ఫెడరల్‌ నిధుల సరఫరాను కాపాడుకోవడం కోసం ట్రంప్ ప్రభుత్వ డిమాండ్లకు కొలంబియా విశ్వవిద్యాలయం తలొగ్గింది. ఈ విషయంపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇతర విశ్వవిద్యాలయాల పరిశోధనలు కొనసాగించాలన్నా ప్రభుత్వం అందించే ఫెడరల్‌ నిధులు కావాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.