ETV Bharat / international

ట్రంప్ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్- గాల్లో తేలినట్లుందంటూ సోషల్​ మీడియాలో పోస్ట్ - TIGER WOODS NEW GIRLFRIEND

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాజీ కోడలితో ప్రేమలో ఉన్న టైగర్‌ వుడ్స్‌ -సోషల్​ మీడియా వేదికగా వెల్లడి

Tiger Woods New Girlfriend Vanessa
Tiger Woods, Vanessa (X@TigerWoods)
author img

By ETV Bharat Telugu Team

Published : March 24, 2025 at 1:09 PM IST

2 Min Read

Tiger Woods New Girlfriend Vanessa : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాజీ కోడలితో ప్రేమలో ఉన్నట్లు గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ వుడ్స్‌ వెల్లడించారు. వెనెసాతో కలిసి దిగిన ఫొటోలను ఎక్స్​లో షేర్​ చేస్తూ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. వెనెసా సైతం తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో టైగర్​ వుడ్స్​తో దిగిన ఫొటోలను షేర్​ చేస్తూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వెనెసాతో తాను డేటింగ్ చేస్తున్నట్లు టైగర్ వుడ్స్ పోస్ట్​లో తెలిపారు. 'నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది. నువ్వు నా పక్కన ఉంటే జీవితం మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో మా వ్యక్తిగత గోప్యతను గౌరవించినందుకు సన్నిహితులకు కృతజ్ఞతలు' అని టైగర్ వుడ్స్ రాసుకొచ్చారు. ప్రసుతం సోషల్​ మీడియాలో ఈ పోస్ట్ వైరల్​గా మారింది.

ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌కు ఆమె మాజీ భార్య కావడం వల్ల ఈ ఈ న్యూస్ హాట్‌ టాపిక్‌గా మారింది. ట్రంప్‌ జూనియర్‌ 2005లో వెనెసాను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో 13 ఏళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2018లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2020లో ట్రంప్‌ జూనియర్‌కు ఫాక్స్‌ న్యూస్‌ మాజీ హోస్ట్‌ కింబర్లీతో నిశ్చితార్థం జరిగింది. అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ మరో అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ట్రంప్ జూనియర్ ఓ అమ్మాయి చేయి పట్టుకొని నడుస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడయాల్లో కనిపించాయి. దీంతో కింబర్లీతో ఆయన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇక టైగర్​ వుడ్స్​ ప్రపంచ గోల్ఫ్‌లో 15సార్లు ఛాంపియన్‌గా నిలిచారు. 2004లో ఎలిన్ నోర్డెగ్రెస్ అనే మోడల్​ను వివాహం చేస్తున్నారు. ఆరేళ్లకే(2010) విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం లిండ్సే వాన్​తో డేటింగ్​లో ఉన్నట్లు 2013లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ​ఎరికా హెర్మెన్​తో ఉన్నారని సోషల్​ మీడియాలో వేదికగా ద్రువీకరించారు. ప్రస్తుతం వెనెసాతో ఉన్నట్లు పోస్ట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.