ETV Bharat / international

ట్రంప్ 'గోల్డ్ కార్డ్​'కు ఫుల్ డిమాండ్- ఒక్కరోజే 1000 సేల్​- 5ట్రిలియన్ డాలర్లు సేకరించే ఛాన్స్​! - TRUMP GOLD CARD VISA

ట్రంప్‌ గోల్డ్‌ కార్డ్‌కు భలే గిరాకీ- ఒక్కరోజే 1000 కార్డలు విక్రయం!- ఇప్పటికే 5 బిలియన్‌ డాలర్లు సేకరించినట్లు అంచనా!

Trump Gold Card Visa
Trump Gold Card Visa (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : March 22, 2025 at 4:42 PM IST

2 Min Read

Trump Gold Card Visa : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన 'గోల్డ్‌ కార్డు'కు భారీ గిరాకీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ వెల్లడించారు. వీటి ద్వారా 5బిలియన్‌ డాలర్లు సేకరించామని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. అంతేకాకుండా లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, వీటిద్వారా 5 ట్రిలియన్‌ డాలర్లు సేకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

'ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉంది. కనీసం 10లక్షల మందైనా ఈ కార్డును కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నారు. అసలు ఈ కార్డును తీసుకురావలనే ఆలోచన ట్రంప్‌ నుంచి వచ్చినదే. అధ్యక్షుడి ఆలోచనను అమలు చేయడమే మా బాధ్యత. దీన్ని అమలు చేసే ప్రణాళిక మా వద్ద ఉంది' అని లుట్నిక్‌ పేర్కొన్నారు.

ఇన్వెస్టర్‌ వీసాతో మోసాలు
ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్​ వీసా ఈబీ-5 స్థానంలో ఈ గోల్డ్‌ కార్డు తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. 5 మిలియన్‌ డాలర్లు చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని తెలిపారు. వారంతా అమెరికాకు వచ్చి భారీగా ఖర్చుపెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ అప్పుడు పేర్కొన్నారు. ఇదే విషయంపై ఇటీవల లుట్నిక్‌ కూడా మాట్లాడారు. సుమారు 2.5లక్షల మంది ఈ గోల్డ్‌ కార్డు కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. EB-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామని అన్నారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈబీ-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్‌ వీసాలను పొందారు. అయితే, ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్‌ కార్డును ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.