Pope Francis Returns Home : 38 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ రోమ్‌లోని గెమెల్లీ యూనివర్సిటీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. న్యుమోనియాతో ఫిబ్రవరి 14న ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ కోలుకున్నారని వైద్యులు తెలిపారు. తనను చూడటానికి భారీగా వచ్చిన ప్రజలకు వీల్ చైర్‌లో ఆస్పత్రి కిటికి వద్దకు చేరి, పోప్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ముందుగా గాజా స్ట్రిప్ అంశంపై స్పందించారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం ఆపాలని, దాడుల కారణంగా వేలాది మంది అమాయకులు బలవుతున్నారన్నారు. వెంటనే యుద్ధం ఆపాలని, కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలు జరపాలని కోరారు. అనంతరం భారీ భద్రత నడుమ వాటికన్ సిటీకి పోప్‌ను తీసుకెళ్లారు.
ఆసుపత్రి నుంచి పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జ్- వీల్ ఛైర్ నుంచే ప్రజలకు అభివాదం! - POPE FRANCIS RETURNS HOME
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పోప్ ఫ్రాన్సిస్- గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని విజ్ఞప్తి!

Published : March 23, 2025 at 7:48 PM IST