Pakistan On PM Modi Speech :పాకిస్థాన్ వ్యవహారశైలిని పరిశీలిస్తామని, భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని పాకిస్థాన్ విమర్శించింది. కానీ, కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రం కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. భారత ప్రధాని తన ప్రసంగంలో చేసి రెచ్చగొట్టే ప్రకటనలకు పాక్ తిరస్కరిస్తున్నట్లు ఆదేశ విదేశాంగ కార్యలయం మంగళవారం ఓ ప్రటనను విడుదల చేసింది.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతున్న వేళ, భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలు పెంచేదిగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది. కాల్పుల విరమణను తామే కోరినట్లు చెప్పడంలో వాస్తవం లేదని చెప్పింది. భారత్ దూకుడు చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని ఆరోపించింది. జమ్ముకశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కారానికి పాకిస్థాన్ ఎల్లప్పుడూ మద్దతు పాక్ పేర్కొంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను కూడా పాక్ మద్దతు ఇస్తుందని తెలిపింది. రానున్న రోజుల్లో ఈ విషయంలో భారతదేశం చర్యలను నిశితంగా పరిశీస్తామని, ప్రపంచ దేశాలు కూడా అదే చేయాలని కోరుతున్నట్లు అని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులను చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత మొదటిసారిగా మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదం-వాణిజ్యం, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాధ్యం కావని ప్రధాని మోదీ అన్నారు. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించవని, అణుబాంబు బెదిరింపుల్ని భారత్ సహించలేదని పేర్కొన్నారు. పాక్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని హెచ్చరించారు. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ ప్రస్తావన తీసుకొచ్చిందని అన్నారు. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ తప్ప ఏ అంశంపైనా చర్చలు ఉండవని స్పష్టం చేశారు.