Pakistan on Kashmir Issue : భారత్‌తో చర్చలకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. శాంతి కోసం భారత్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్ అన్నారు. అయితే చర్చల్లో కశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని షరతు పెట్టారు. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన, భారత్‌తో చర్చలకు సిద్ధమన్నారు. పాక్ శాంతిని కోరుకుంటుందని, తమ ప్రాంతంలో అభివృద్ధి, శ్రేయస్సును కోరుకుంటున్నామని షెహబాజ్ పేర్కొన్నారు. అయితే, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ స్పష్టం చేసింది.
ప్రధాని షరీఫ్‌తో పాటు పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, ఇతర అధికారులు కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించారు. కాగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత ప్రధానికి ఇది రెండో వైమానిక స్థావర పర్యటన. అంతకుముందు బుధవారం సియాల్కోట్ ఆర్మీ బేస్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న సైనికులతో ముచ్చటించారు.
మోదీని కాపీ కొట్టారంటూ సెటైర్లు
అయితే, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కాపీ కొట్టడంపై నెటిజన్లు ఆయనను ఆడుకుంటున్నారు. భారత సైన్యం జరిపిన దాడుల్లో ధ్వంసమైన సియాల్‌కోట్‌లోని ఆర్మీబేస్‌ను పాక్ ప్రధాని సందర్శించారు. పంజాబ్‌లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ను మోదీ సందర్శించిన మరుసటిరోజే సియాల్‌కోట్‌లోని పస్పూర్ కంటోన్మెంట్ ప్రాంతానికి వెళ్లారు. తమ సైనికులతో పాక్ ప్రధాని ముచ్చటించారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీని పాక్ పీఎం కాపీ కొట్టారంటూ మీమర్లు షెహబాజ్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. భారత్ చేతిలో ఓడిపోయినా పాక్ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. ఓడిపోతే కూడా స్వీట్లు పంచుకుంటారా అని చురకలంటించారు.
కాల్పుల విరమణ ఒప్పందం పొడగింపు
మరోవైపు కాల్పుల విరమణపై ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్’ (డీజీఎంవో) స్థాయిలో చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ఈ నెల 18 వరకు కొనసాగించేందుకు భారత్, పాక్‌లు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి ముందు భారత్ డీజీఎంవో లెఫ్టినెంట్ రాజీవ్ ఘాయ్, పాక్ డీజీఎంవో మేజర్ జనరల్ కష్రిఫ్ అబ్దుల్లాలు హాట్‌లైన్లో మాట్లాడుకుని నిర్ణయించారు.
కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నాం : మోదీ ప్రసంగంపై స్పందించిన పాక్
పాకిస్థాన్‌కు మిలిటరీ సామాగ్రిని పంపించలేదు- వారిపై చర్యలు తీసుకుంటాం : చైనా