Trump On Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా సాగిన మాటల యుద్ధం ఇప్పుడు చ్చరనీయాంశంగా మారింది. ఈ పరిమాణాలపై డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించగా తాను బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మస్క్ గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని తెలిపారు.
' నిజంగా నేను చాలా బిజీగా ఉన్నా. రష్యా, చైనా, ఇరాన్‌కు సంబంధించిన విషయాలపై నేను పని చేస్తున్నా. ఆయన బాగుండాలని అని మాత్రమే కోరుకుంటున్నా' అని ట్రంప్ మీడియాకు తెలిపారు.
VIDEO | On Board Air Force One: Responding to a question on Elon Musk, US President Donald Trump (@POTUS) said: " honestly, i have been so busy working on china, working on russia, working on iran, working on so many... i just wish him well."
— Press Trust of India (@PTI_News) June 7, 2025
(source: third party)
(full video… pic.twitter.com/mFZIpn56XP
డొనాల్ట్ ట్రంప్, ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ అంటే, తానెవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్ బదులిచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్) నుంచి తప్పించినందుకే మస్క్‌కు కోపం అంటూ తెలిపారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా పోస్టులు వేస్తున్న సమయంలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ మస్క్ ఓ ఆసక్తికర చర్చకూ తెర లేపారు. 80 శాతం అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా అంటూ ఎక్స్‌లో పోల్ పెట్టారు. 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.
రెండోసారి అధ్యక్షగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్, ఎలాన్ మస్క్‌ను డోజ్‌కు అధిపతిగా నియమించారు. ఇటీవల ఆ బాధ్యతలు నుంచి మస్క్ వైదొలిగారు. వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా మస్క్‌కు బంగారు తాళం బహుమతిగా ఇచ్చారు. అయితే ట్రంప్ రూపొందించిన పన్ను,వ్యయ బిల్లు వల్లే మస్క్ డోజ్ నుంచి వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మొదటి నుంచే మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ట్రంప్ అభివర్ణిస్తున్నారు. మస్క్ మాత్రం అమెరికన్ల అప్పుల భారాన్ని పెంచే బిల్లంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిల్లు ప్రస్తుతం సెనెట్ పరిశీలనలో ఉంది.