హంగేరియన్ రచయిత క్రాస్జ్నాహోర్కైకు సాహిత్యంలో నోబెల్
హంగేరియన్ రచయిత లాస్జ్లో క్రాస్జ్నాహోర్కైకి సాహిత్యంలో నోబెల్

Published : October 9, 2025 at 4:39 PM IST
Nobel Prize in Literature 2025 : హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్‌జ్నా హోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అపోకలిప్టిక్ భయాల మధ్య కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. నోబెల్ అవార్డ్ వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్థంతి అయిన డిసెంబర్ 10న ఈ బహుమతి ప్రదానం చేయనున్నారు. 1901 నుంచి 2024 వరకు 117 సార్లు సాహిత్యంలో నోబెల్ ప్రకటించగా, 122మందికి ప్రదానం చేశారు. ఇప్పటివరకు 18 మంది మహిళలు ఈ పురస్కారం అందుకున్నారు. గతేడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు ఈ బహుమతి లభించింది.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 9, 2025
The 2025 #NobelPrize in Literature is awarded to the Hungarian author László Krasznahorkai “for his compelling and visionary oeuvre that, in the midst of apocalyptic terror, reaffirms the power of art.” pic.twitter.com/vVaW1zkWPS
మరోవైపు సోమవారం (అక్టోబర్ 6న) వైద్యరంగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13 వరకు సాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రంలో, గురువారం సాహిత్యంలో నోబెల్ గ్రహీతల పేర్లు వెల్లడించారు. శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటించనున్నారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.
వైద్యశాస్త్రంలో నోబెల్ విజేతలు
ఈ ఏడాది వైద్య శాస్త్రంలో మేరీ ఇ.బ్రుంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమోన్ సకాగుచి అనే ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. రోగనిరోధక వ్యవస్థపై చేసిన పరిశోధనలకు గాను వీరిని ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతలు
ఈ ఏడాది జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్. డెవోరెట్, జాన్ ఎం. మార్టినిస్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. క్వాంటం మెకానికల్ టన్నెలింగ్లో చేసిన పరిశోధనలకు గాను నోబెల్ కమిటీ వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఇక అక్టోబర్ 10, 13 తేదీల్లో వరుసగా సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రం విభాగాలకు సంబంధించిన నోబెల్ పురస్కారాలను ప్రకటించనున్నారు.
స్వీడెన్కు చెందిన దిగ్గజ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ గుర్తుగా ఏటా డిసెంబర్ 10న ఈ పురస్కారాలు అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని నోబెల్ కమిటీ ఇందుకు ఎంపిక చేస్తుంది. నోబెల్ విజేతలకు డిప్లొమా, బంగారం పతకంతో పాటు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు (సుమారు రూ.10.38 కోట్లు) అందజేస్తారు.
అంత ఈజీ కాదు!
నోబెల్ అవార్డు దక్కించుకోవడం అంత సులభం కాదు. నామినేషన్లకు సంబంధించిన వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు. నోబెల్ నియమాల ప్రకారం, కమిటీలోని జడ్జీలు 50 ఏళ్ల పాటు ఈ అవార్డులకు సంబంధించి బహిరంగంగా ఎలాంటి చర్చలు చేయకూడదు. మరో కీలకమైన విషయం ఏమిటంటే, వ్యక్తులు తమను తాము స్వయంగా నోబెల్ అవార్డులకు నామినేట్ చేసుకునేందుక అవకాశం ఉండదు. లేరు. కానీ ఇతరులు సదరు వ్యక్తులను ఎన్నిసార్లు అయినా నామినేట్ చేయవచ్చు. ఇలా ఇతర వ్యక్తులను నామినేట్ చేసేవారు తమ సిఫార్సులను బహిరంగంగా ప్రకటించుకోవచ్చు.
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ పురస్కారం- పర్యావరణ పరిరక్షణ ఆవిష్కరణల్లో కృషి

