Canada PM Carny Election Campaign : ఇటీవల కెనడా ప్రధానిగా పగ్గాలుచేపట్టిన మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు సమాచారం. ఏప్రిల్ 28న పార్లమెంటు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇవాళ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ప్రధాని కార్నీ ఒట్టావా నుంచి బరిలోకి దిగనున్నారు. జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీనితో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా కార్నీని ఎన్నుకున్నారు. కొత్త నాయకత్వం ఏర్పడిన తర్వాత గ్లోబల్ న్యూస్ నిర్వహించిన పోల్ సర్వేల్లో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. 42 శాతం ఓటర్లు లిబరల్ పార్టీకి మద్దతుగా, 36శాతం మంది కన్జర్వేటర్లకు అనుకూలంగా ఉన్నారు. 48 శాతం ప్రజలు మార్క్ కార్నీ నాయకత్వాన్ని ఆమోదించగా, 30 శాతం వ్యతిరేకిస్తున్నట్లు సర్వేల్లో వెల్లడైంది.
ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ- ఏప్రిల్ 28నే ఎలక్షన్స్! - CANADA PM CARNY ELECTION CAMPAIGN
ఏప్రిల్ 28న కెనడా పార్లమెంటు ఎన్నికలు- ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ!

Published : March 23, 2025 at 6:54 PM IST