ETV Bharat / international

నాసా బంపర్ ఆఫర్​! ఆ పని చేయడానికి సలహా ఇస్తే రూ.25కోట్లు! - NASA CHALLENGE MOON HUMAN WASTE

నాసా సూపర్​ ఆఫర్​! ఆ ఛాలెంజ్​లో గెలిస్తే రూ.25కోట్లు సొంతం చేసుకోవచ్చు!

NASA Challenge Moon Human Waste
NASA Challenge Moon Human Waste (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : April 12, 2025 at 5:18 PM IST

2 Min Read

NASA Challenge Moon Human Waste : చంద్రుడిపై దాగి ఉన్నరహస్యాలను తెలుసుకునేందుకు చాలా దేశాలు ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దాదాపు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది. అయితే అపోలో మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు. లూనార్ మాడ్యూల్స్‌లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేశారు.

రూ.25 కోట్ల ఆఫర్!
అయితే చంద్రుడిపైనే ఉండిపోయిన వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న నాసా లూనా రీసైకిల్‌ పేరిట ఒక ఛాలెంజ్‌ను ప్రకటించింది. వ్యర్థాలను నీరు, ఇంధనం, ఎరువుగా మార్చేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ ఆహ్వానం పలికింది. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి దాదాపు రూ.25 కోట్లు అందజేస్తామని తెలిపింది.

చంద్రుడిపైనే కాకుండా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్‌ ద్వారా మళ్లీ వినియోగిస్తుంటారు. అక్కడ ఉండే మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించాలన్నా, తిరిగి భూమిపైకి తీసుకురావాలన్నా అనేక సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరిష్కార మార్గాలు తెలపాలంటూ నాసా ఒక ఛాలెంజ్ ప్రకటించింది. భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నాసా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారాలను కనుగొనాలని చూస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికితే అమెరికాతో పాటు జాబిలిపై పరిశోధనలు సాగిస్తున్న భారత్ వంటి దేశాలకూ ఉపయుక్తంగా ఉంటుంది.

సమీప భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలు ఏర్పాటు లక్ష్యంగా నాసా ఆర్టెమిస్​ మిషన్​పై పనిచేస్తోంది. దానికి ముందు చంద్రుడిపై ఉన్న మాన వ్యర్థాలను నిర్వహణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఎక్కువ సమయం పట్టే అంతరిక్ష మిషన్​లలో అన్ని వనరులు టైట్​గా నిర్వహించడం, తిరిగి ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఆ వ్యర్థాలను తిరిగి భూమికి తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు నాసా ఇన్​-సిటు ప్రాసెసింగ్​ వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ ఛాలెంజ్​ ఇచ్చింది.

చంద్రుడిపై ఇక ఇళ్లు కట్టొచ్చు! బ్యాక్టీరియాతో ఇటుకలు! విరిగిపోయినా మళ్లీ అతుక్కుంటాయ్!

చంద్రునిపైకి మహిళను పంపే ప్లాన్​ను విరమించుకున్న నాసా!- కారణం ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.