ETV Bharat / international

వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్​- బిగ్​బాంబ్ పోస్ట్ డిలీట్​- ట్రంప్​తో సంధి కుదిరేనా? - MUSK DELETES EXPLOSIVE POST

బిగ్‌బాంబ్‌ పోస్టు డిలీట్ చేసిన మస్క్‌- ట్రంప్​తో సంధికి సిద్ధమేనని సిగ్నల్​!

Elon Musk And Trump
Elon Musk And Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : June 7, 2025 at 7:58 PM IST

2 Min Read

Musk Deletes Explosive Post : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌పై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయి విమర్శలు చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్‌ కాస్త వెనక్కితగ్గారు. ట్రంప్​పై చేసిన బిగ్​బాంబ్​ పోస్టును ఆయన తాజాగా తొలగించారు.

ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ మధ్య బంధం బీటలు వారిన సంగతి తెలిసిందే. దీనితో ఒకరిపై మరొకరు బహిరంగంగానే ఘాటు విమర్శలు చేసుకున్నారు. ఇంకా వీరు మళ్లీ కలుస్తారా? అనే స్థాయిలో పరస్పరం నిందించుకున్నారు. ఇలాంటి తరుణంలోనే ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన బిగ్​బాంబ్​ పోస్టును మస్క్‌ తాజాగా తొలగించడం గమనార్హం.

సెక్స్ కుంభకోణంలో ట్రంప్​!
ఇటీవల ఎలాన్​ మస్క్​, అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో డొనాల్డ్​ ట్రంప్‌ పేరు కూడా ఉందని మస్క్ ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయటపెట్టలేదని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు భవిష్యత్తులో దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటపడతాయన్నారు. అయితే తాజాగా ఆ పోస్టును ఎలాన్​ మస్క్​ తొలగించారు. వారిద్దరి మధ్య సంధికి ఇదొక సూచిక అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంధి సాధ్యమేనా?
ఇదిలా ఉంటే, ట్రంప్‌తో శాంతి కుదుర్చుకోవాలని అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్‌ అక్‌మాన్ - ఎలాన్​ మస్క్​ను కోరారు. ఈ ఇద్దరికి మద్దతుగా మాట్లాడిన ఆయన, మనం విడిగా ఉండటం కంటే, కలిసి ఉంటేనే బలంగా ఉంటామని ఓ పోస్ట్ పెట్టారు. దానికి ప్రతిగా, మీరు చెప్పింది తప్పుకాదంటూ మస్క్‌ బదులిచ్చారు. మరోవైపు మస్క్​పై ట్రంప్​ బహిరంగ విమర్శలు చేయకుండా వైట్‌హౌస్ ప్రతినిధులు కృషి చేస్తున్నారని ఓ మీడియా కథనం పేర్కొంది.

నేను చాలా బిజీ: ట్రంప్​
మరోవైపు ఈ విభేదాలపై అధ్యక్షుడు ట్రంప్‌ ను మీడియా ప్రశ్నించగా, "నేను చాలా బిజీగా ఉన్నాను. చైనా, రష్యా, ఇరాన్‌ సంబంధిత విషయాలపై పని చేస్తున్నాను. నాకు చాలా పనులు ఉన్నాయి. ఎలాన్‌ మస్క్‌ గురించి నేను ఆలోచించడం లేదు. అయితే ఆయన బాగుండాలని కోరుకుంటున్నా. మేము అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఎలాన్​ మస్క్‌ చాలా సబ్సిడీలు పొందారు. పెద్ద మొత్తంలో నిధులు అందుకున్నారు. దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతా పారదర్శకంగానే జరిగిందా? లేదా? అనేది చూడాలి. మస్క్‌ లేకపోయినా మా ప్రభుత్వం కొనసాగుతుంది. ఎవరు లేకపోయినా అమెరికాకు ఏం కాదు. ఒక్క నేను తప్ప" అని బదులిచ్చారు. ఈ పరిణామాలు మస్క్‌ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా టెస్లా షేర్లు దారుణంగా పతనమయ్యాయి.

మస్క్​ గురించి ఏం ఆలోచించడం లేదు- నేను బిజీగా ఉన్నా : డొనాల్డ్ ట్రంప్

G7 శిఖరాగ్ర సమావేశంలో భారత్​ పాల్గొనడం చాలా అవసరం: కెనడా ప్రధాని మార్క్ కార్నీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.