Iran Israel Conflict : ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడితో పశ్చిమాసియా భగ్గుమంది. అయితే ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్, ప్రతిస్పందన దాడులు మొదలుపెట్టింది. టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా మిసైళ్ల దాడి చేసింది. పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ క్షిపణి దాడులు చేపట్టింది. వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఇంటర్‌సెప్టార్ కిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రమయ్యాయి.
అయితే ఇరాన్ చేపట్టిన మిసైల్ దాడుల్లో టెల్ అవీవ్, జెరూసలెంలో పలుచోట్ల బాంబులు పేలుళ్లు చోటుచేసుకోగా, కొందరు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో ఒక్కసారిగా సైరన్లు మోగాయి. తమ పౌరులే లక్ష్యంగా ఇరాన్ దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ ప్రజలకు ముప్పు పొంచి ఉన్నట్లు చెప్పింది. ఇరాన్ 100కు పైగా క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది. వాటిలో చాలా వాటిని కూల్చినట్లు పేర్కొంది. రెండు ఇజ్రాయెల్‌కు చెందిన ఫైటర్ జెట్‌లను కూల్చినట్లు ఇరాన్ చెప్పగా, వాటిని ఖండించింది.


అదే సమయంలో ఇరాన్ ప్రతిస్పందన దాడులు చేపట్టకుముందు ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగింది. ఇస్ఫహాన్ అణుస్థావరంపై విరుచుకుపడింది. మొత్తం 200 లక్ష్యాలపై దాడిచేసింది. ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్‌లు ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై విరుచుకుపడి లక్ష్యాలను ఛేదించినట్లు చేధించాయి. అక్కడే అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతోన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇరాన్‌కు చెందిన పలు ఎయిర్ బేస్‌లను ధ్వంసం అయ్యామని, అవసరమైతే మళ్లీ దాడి చేస్తామని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరుులు మరణించారని, 320 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ UN రాయబారి చెప్పారు.


మరోవైపు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిస్పందన దాడుల విషయంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. తమ సైన్యం దాడికి సిద్ధంగా ఉందని ఖమేనీ అన్నారు. "వారు దాడి చేస్తే అది ముగిసిపోయిందని అనుకోకండి. లేదు. వారు పని ప్రారంభించారు యుద్ధాన్ని ప్రారంభించారు. వారు చేసిన ఈ గొప్ప నేరం నుంచి సురక్షితంగా తప్పించుకోవడానికి మేం వారిని అనుమతించం" అని చెప్పారు. అయితే ఖమేనీ, అధ్యక్షుడి కార్యాలయం సమీపంలోనే దాడులు జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.
ఇరాన్ VS ఇజ్రాయెల్ - ఎవరి సైనికశక్తి ఎంత? ఇరాన్ ప్రతీకారానికి దిగితే ఏమవుతుంది?
అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు- ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్