ETV Bharat / international

యూఎస్​ వీసా రద్దు- కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు - INTERNATIONAL STUDENTS US VISA CASE

యూఎస్​ స్టూడెంట్​ వీసాలు రద్దు - న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

International Students US VISA Case
International Students US VISA Case (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : April 15, 2025 at 3:38 PM IST

2 Min Read

International Students US VISA Case : అమెరికా విదేశాంగ శాఖ వీసాలు రద్దు చేయటాన్ని సవాల్‌ చేస్తూ పలువురు విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో చదువులు కొనసాగించలేకపోతున్నామని, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సహా మేరీల్యాండ్, ఒహియో స్టేట్ వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్య అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు.

హమాస్‌కు మద్దతుగా జరిగిన క్యాంపస్‌ ఆందోళనల్లో పాల్గొన్నారంటూ కొందరు విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్‌ సర్కార్‌ రద్దు చేసింది. అయితే ఆందోళనల్లో పాల్గొనని విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్లు కళాశాలలు పేర్కొంటున్నాయి. కొందరు విద్యార్థులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీసా రద్దు చేసినట్లు చెప్తుండగా, మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణాలు చెప్పటం లేదని బాధితులు కోర్టుకు విన్నవించారు. ఇలాంటి కారణాలతో వీసాలు రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యార్థులు వాదిస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా!
క్యాంపస్‌ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన విద్యార్థులతోపాటు, అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వారిని కూడా ట్రంప్ సర్కార్​ దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. తరువాత పలు యూనివర్సిటీ విద్యార్థుల వీసాలను కూడా రద్దు చేసింది.

చట్టబద్దమైన పత్రాలు లేని విద్యార్థులను, హమాస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్నారు. ఇప్పుడు అన్నంత పని చేశారు.

విద్యార్థి వీసాలు ఎలా పని చేస్తాయి?
అమెరికాలో విద్య అభ్యసించాలంటే విదేశీ విద్యార్థులు ఎఫ్​1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అమెరికాలోని ఓ విద్యా సంస్థలో ప్రవేశం పొందిన తరువాత, విద్యార్థులు అమెరికా రాయబార కార్యాలయంలో లేదా విదేశాల్లోని కాన్సులేట్​ల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వారిని ఇంటర్వ్యూ చేసి, అన్ని అర్హతలు ఉంటే ఎఫ్​1 వీసాను జారీ చేస్తారు.

అయితే ఇలా ఎఫ్​1 వీసా పొందాలంటే, విద్యార్థులు తమ చదువుకయ్యే ఆర్థిక వనరులు తమ దగ్గర ఉన్నాయని నిరూపించుకోవాలి. అలాగే వాళ్ల అకడమిక్స్ చాలా బాగుండాలి. ఈ ఎంట్రీ వీసాలను స్టేట్ డిపార్ట్​మెంట్ నిర్వహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే విదేశీ విద్యార్థులు అమెరికాలో అడుగుపెడతారో, అప్పటి నుంచి వారి కార్యకలాపాలను డిపార్ట్​మెంట్ ఆఫ్ హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పనిచేసే స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్​ విజిటర్ ప్రోగ్రామ్ పర్యవేక్షిస్తుంది.

అయితే ఇటీవలి కాలంలో, ఈ హోంల్యాండ్ సెక్యూరిటీ- తన డేటా బేస్​ నుంచి పలువురు విదేశీ విద్యార్థుల చట్టపరమైన నివాస స్థితిని తొలగించింది. దీనితో ఆ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వీలులేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఆ విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్ షాక్- 2.2 బిలియన్​ డాలర్ల కోత

'30 రోజుల్లో స్వతాహగా దేశం విడిచి వెళ్లిపోండి'- వారికి అమెరికా వార్నింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.