ETV Bharat / international

కన్న కొడుకుని చంపిన కసాయి తల్లి- డిస్నీల్యాండ్​ చూపిస్తానని తీసుకెళ్లి! - INDIAN ORIGIN WOMAN MURDERED SON

విహార యాత్రకని తీసుకెళ్లి- కుమారుడిని కడతేర్చిన భారత సంతతి మహిళ

Indian Origin Woman Murdered Son
Indian Origin Woman Murdered Son (Accused Saritha Ramaraju (X@SantaAnaPD))
author img

By ETV Bharat Telugu Team

Published : March 23, 2025 at 3:45 PM IST

1 Min Read

Indian Origin Woman Murdered Son : కన్నతల్లి తన బిడ్డను కడతేర్చిన దారుణమైన ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. భారత సంతతికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల కుమారుడిని హతమార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

48 ఏళ్ల సరితా రామరాజు 2018లో భర్త నుంచి విడిపోయారు. దీనితో కోర్ట్​ ఆ దంపతుల కుమారుడి బాధ్యతలను భర్తకు అప్పగించింది. తల్లికి ఆ బిడ్డను అప్పుడప్పుడు కలిసే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం ఆమె వర్జీనియాలో నివసిస్తోంది. ఇటీవల తన కుమారుడిని కలిసేందుకు కాలిఫోర్నియాలోని శాంటా అనాలో ఓ హోటల్‌లో రూమ్‌ తీసుకుంది. కుమారుడితో సరదాగా గడిపేందుకు డిస్నీల్యాండ్‌లో పాస్‌లను కూడా కొనుగోలు చేసింది. మార్చి 19న ఆ బాబుని తిరిగి తండ్రికి అప్పగించాల్సి ఉంది. అయితే అది సరితకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అదే రోజున ఉదయం 9:12 గంటలకు స్థానిక పోలీసులకు ఫోన్ చేసి, తాను తన కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకోనున్నట్లు వెల్లడించింది.

దీనితో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. కానీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే బాలుడు మృతి చెందాడు. నిందితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే, మహిళ ఫోన్ చేసే సమయం కంటే చాలా గంటల ముందే బాలుడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో హత్యకు వినియోగించిన కత్తిని అధికారులు గుర్తించారు. హత్యకు ముందు రోజే నిందితురాలు దాన్ని కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.