ETV Bharat / international

G7 శిఖరాగ్ర సమావేశంలో భారత్​ పాల్గొనడం చాలా అవసరం: కెనడా ప్రధాని మార్క్ కార్నీ - MARK CARNEY ABOUT INDIA AT G7

జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారత్​ను ఆహ్వానించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ- అంగీకరించిన ప్రధాని మోదీ

Mark Carney
Mark Carney (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : June 7, 2025 at 5:17 PM IST

2 Min Read

Mark Carney About India At G7 : భారత్​- కెనడా దౌత్య సంబంధాలు అతంతమాత్రంగా ఉన్న వేళ, ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత్​ పాల్గొనడం అవసరం అని ఆయన అన్నారు.

"జీ7 దేశాలు రానున్న శిఖరాగ్ర సమావేశంలో భద్రత, శక్తి (ఎనర్జీ), డిజిటల్ భవిష్యత్​, కీలకమైన ఖనిజాలు, మౌలిక సదుపాయాల కల్పన​ సహా పలు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుపుతాయి. కనుక ఈ సమావేశంలో భారత్ పాల్గనడం చాలా అవసరం. ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉంది. అంతేకాదు ఇండియా అనేక సరఫరా గొలుసులకు కేంద్రంగా ఉంది. కనుక భారత్​ ఈ సమావేశంలో పాల్గొనడం అర్థవంతంగా ఉంటుంది."
- మార్క్​ కార్నీ, కెనడా ప్రధానమంత్రి

'ప్రస్తుతం కెనడా జీ7 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో కొన్ని కీలక దేశాలు పాల్గొనాల్సి ఉంది. అందుకే మేము భారత్​ను ఆహ్వానించాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ మా ఆహ్వానాన్ని అంగీకరించారు. దీనితో పాటు మేమిద్దరం చట్టాల అమలుకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నాం. దీనితో కొంత పురోగతి కనిపించే అవకాశం ఉంది' అని మార్క్ కార్నీ పేర్కొన్నారు.

జీ7 సమావేశంలో పాల్గొంటా: ప్రధాని మోదీ
కెనడా నూతన ప్రధాని మార్క్​ కార్నీ ఆహ్వానం అందిందని, కనుక తాను కెనడాలో జరగనున్న 'గ్రూప్ ఆఫ్​ సెవెన్'​ (జీ7) శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతానని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

"కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి పిలుపు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయన కెనడా ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. ఈ నెల చివర్లో కననాస్కిస్​లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్​, కెనడా పరస్పర గౌరవం, భాగస్వామ్య ఆసక్తులతో కలిసి పనిచేస్తాయి."
- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​

దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు!
2023 జూన్​లో వాంకోవర్​లోని సిక్కు ఆలయం వెలుపలు కెనడియన్​ పౌరుడు, ఖలిస్థాన్​ ఉగ్రవాది హర్దీప్​ సింగ్​ నిజ్జర్​ హత్య జరిగింది. అయితే ఈ హత్య చేసింది భారతీయ ఏజెంట్లే అని కెనడా ఆరోపించింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. తరువాత ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. దీనితో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సందర్భంలో మోదీని జీ7 సమావేశాలకు కెనడా ప్రధాని ఆహ్వానించడం గమనార్హం.

ట్రంప్ డిమాండ్లకు ఓకే- నాటో దేశాలు అందుకు సిద్ధం: మార్క్ రుట్టే

మస్క్​ గురించి ఏం ఆలోచించడం లేదు- నేను బిజీగా ఉన్నా : డొనాల్డ్ ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.