Musk Trump Relations : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి అత్యంత ధనవంతుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. కొన్ని వారాలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇద్దరు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకున్నారు.
అయితే గతవారం ట్రంప్‌పై విమర్శలు చేస్తూ తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అలా పోస్టులు పెట్టినందుకు బాధపడుతున్నానని పేర్కొన్నారు. ట్రంప్ విషయంలో తాను హద్దులు మీరినట్లు మస్క్ ఎక్స్ వేదికగా చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనేక రకాలుగా మద్దతుగా మస్క్ నిలిచారు. ఇటీవల ఓ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో రెండు వారాలుగా ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు.
Tesla CEO Elon Musk posts on 'X': " i regret some of my posts about president donald trump last week. they went too far." pic.twitter.com/6Gx6LXqp5r
— ANI (@ANI) June 11, 2025