ETV Bharat / international

గింగిరాలు తిరుగుతూ నదిలో కూలిన హెలికాప్టర్‌- కుటుంబంతో సహా టెక్‌ కంపెనీ CEO మృతి - HELICOPTER CRASH NEW YORK

న్యూయార్క్ నదిలో కూలిపోయిన హెలికాప్టర్- ఆరుగురు మృతి- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రమాద వీడియోలు

Helicopter Crash in New York
Helicopter Crash in New York (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : April 11, 2025 at 8:52 AM IST

1 Min Read

Helicopter Crash in New York : అమెరికాలో మరో విమానం ప్రమాదం జరిగింది. న్యూయార్క్‌లో ఓ పర్యటక హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ హడ్సన్​​ నదిలో కుప్పకూలి ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు మరణించారు. అయితే, మృతులంతా ఓ టెక్​ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబ సభ్యులే అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌ కంపెనీ స్పెయిన్‌ విభాగ అధిపతి, సీఈఓ అగస్టన్‌ ఎస్కోబార్‌ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ హడ్సన్‌ నది మీదుగా వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. గింగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగడం వల్ల హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు మృతి చెందారు.వీరిలో ఎస్కోబార్‌, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు పైలట్‌ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక ప్రమాదానికి గురైన బెల్‌ 206 చాపర్‌ను న్యూయార్క్‌ హెలికాప్టర్‌ టూర్స్‌ విభాగం సైట్‌ సీయింగ్‌ కోసం వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8గంటలకు హెలికాప్టర్​ను బయటకు తీశామని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. హెలికాప్టర్​ అదుపు లేకుండా గింగిరాలు తిరుగుతూ నదిలో పడిపోయిందని స్థానికులు అంటున్నారు. అనేక సార్లు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించి కిటికీలో నుంచి చూస్తే చాపర్​ నదిలో పడిపోతుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.