ETV Bharat / international

పుతిన్​తో ఫోన్​ కాల్- కాల్పుల విరమణ గురించి కాదు: ట్రంప్ - TRUMP PUTIN PHONE CALL

ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి ఘటన నేపథ్యంలో పుతిన్‌తో ఫోన్​లో మాట్లాడిన డొనాల్డ్‌ ట్రంప్‌

Trump Putin Phone Call
Trump Putin Phone Call (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : June 5, 2025 at 7:17 AM IST

2 Min Read

Trump Putin Phone Call : రష్యాపై ఇటీవల ఉక్రెయిన్‌ చేసిన డ్రోన్‌ దాడులకు గట్టిగా బదులిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్‌ పరస్పరం దాడులు ఉద్ధృతం చేసుకుంటున్న వేళ ట్రంప్‌ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. వివిధ అంశాలపై గంటా 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఈ మేరకు ఇరువురి మధ్య జరిగిన సంభాషణ వివరాలను ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్టు చేశారు.

పుతిన్‌తో సుదీర్ఘంగా సాగిన ఫోన్‌ సంభాషణ చాలా బాగా జరిగిందని ట్రంప్ తెలిపారు. కానీ, తక్షణం కాల్పుల విరమణకు దారితీసే చర్చలు కావని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో ఉక్రెయిన్‌ జరిపిన దాడిని మొదటిసారి విమర్శించిన శ్వేతసౌధం దాడుల గురించి తమకు ముందస్తు సమాచారం లేదని వెల్లడించింది. ఇరాన్‌ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండకూడదన్న తన అభిప్రాయంతో పుతిన్‌ ఏకీభవించినట్లు ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి తనవంతు సాయం చేస్తానని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారని చెప్పారు. అణు ఒప్పందంపై ఇరాన్ చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటోందని ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవల ఇస్తాంబుల్‌ వేదికగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్న వేళ ఎన్నడూ లేని విధంగా కీవ్​ భారీ ఆపరేషన్​ చేపట్టింది. స్పైడర్ వెబ్​ పేరుతో డ్రోన్ల దాడులను నిర్వహించింది. ఏకంగా రష్యా భూభాగంలోకి కంటెయినర్లలో డ్రోన్లను తరలించి వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టింది. ఇర్కుట్స్క్‌ ప్రాంతంలోని వైమానిక స్థావరంలోకి వెళ్లి మరీ డ్రోన్లు దాడులు చేశాయి. ఈ ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు, పలు ఎయిర్‌ బేస్‌లు ధ్వంసం అయ్యాయి. టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ఈ దాడుల్లో ధ్వంసం అయ్యాయి. దీంతో గత మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్​ భారీగా దాడి చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ దాడి ఉక్రెయిన్‌ దళాలకు మరింత ప్రోత్సాహమిచ్చినట్లైందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.