ETV Bharat / international

కొత్త పార్టీ ఏర్పాటుపై మస్క్​ కీలక వ్యాఖ్యలు- స్ట్రాంగ్ వార్నింగ్​ ఇచ్చిన ట్రంప్ - ELON MUSK TRUMP CONTROVERSY

అమెరికాలో కొత్త పార్టీ అవసరం- మస్క్ కీలక వ్యాఖ్యలు

elon musk on new party
elon musk on new party (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : June 8, 2025 at 9:08 AM IST

2 Min Read

Elon Musk on New Party : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మధ్య చేలరేగిన ఘర్షణ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా వ్యాఖ్యలు చేసుకున్న వీరు ఆ తర్వాత ఎవరి పనిలో వారు పడిపోయారు. తాను వేరే పనులతో బిజీగా ఉన్నానని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించగా, ‘ద అమెరికా పార్టీ’ అంటూ కొత్త పార్టీపై మస్క్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు ఇద్దరూ కాస్త తగ్గాలని రిపబ్లికన్లు కోరుతున్నారు.

పార్టీ పేరుపై మస్క్‌ వ్యాఖ్య
అయితే, అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్న మస్క్‌ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమేనని, దీన్ని 80శాతం మంది సమర్థించారని చెప్పుకొచ్చారు. ‘ద అమెరికా పార్టీ’ అంటూ మస్క్‌ ఈ పోస్టు చేయడం కలకలం రేపారు. అయితే అమెరికాలో పుట్టని మస్క్‌కు అధ్యక్షుడయ్యే ఛాన్స్​ లేదు. 80 శాతం అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ ఫాలోవర్లను ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. ఆ ఓటింగ్‌ ఫలితాన్ని ప్రకటిస్తూనే మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

డెమోక్రాట్లకు మస్క్‌ మద్దతిస్తే తీవ్ర పరిణామాలు: ట్రంప్‌
ఘర్షణల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. 2026 మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అల్టిమేటం జారీ చేశారు. అయితే ఆ పరిణామాలు ఏమిటో వెల్లడించలేదు. మస్క్‌తో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకునే ఆలోచన లేదన్నారు. మొదటిసారి అమెరికా అధ్యక్షపగ్గాలు చేపట్టినప్పుడు మస్క్‌కు ఎంతో సహకరించినట్లు ట్రంప్‌ చెప్పారు.

ఈ వ్యవహారంపై స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ట్రంప్‌ను వెంబడించటం ద్వారా మస్క్‌ పెద్ద తప్పు చేస్తున్నారని అన్నారు. భావోద్వేగంతోనే ఆయన నిరాశకు గురయ్యాడని తక్కువగా అంచనా వేసినట్లు చెప్పారు. మస్క్‌ దూకుడు చూస్తుంటే అంత సర్దుకుంటుందనే తన అంచనాలు నిజమయ్యే అవకాశం లేదని జేడీ వాన్స్ అన్నారు. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు విషయంలో ట్రంప్‌-మస్క్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరువురు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.

మరోవైపు ట్రంప్, మస్క్‌ల మధ్య విభేదాలతో షాక్‌కు గురైన రిపబ్లికన్లు శాంతి మంత్రం పఠిస్తున్నారు. ఇద్దరూ మళ్లీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నామని, అప్పుడే దేశానికి మంచి చేయగలమని సెనేటర్‌ టెడ్‌ క్రజ్‌ స్పష్టం చేశారు. ఇంకా పలువురు సెనేటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు వారిద్దరి మధ్య సయోధ్య కుదరాలని పిలుపునిచ్చారు. ట్రంప్, మస్క్‌ల వివాదం ప్రభావం పన్ను, సరిహద్దు బిల్లుపై ఉండబోదని స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ వెల్లడించారు.

వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్​- బిగ్​బాంబ్ పోస్ట్ డిలీట్​- ట్రంప్​తో సంధి కుదిరేనా?

మస్క్​ గురించి ఏం ఆలోచించడం లేదు- నేను బిజీగా ఉన్నా : డొనాల్డ్ ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.