Female Celebrities Space Tour : రోదసి పర్యటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. మహిళా సెలబ్రిటీల బృందంతో అంతరిక్ష యాత్ర నిర్వహించింది. వీరిలో ఆయన కాబోయే సతీమణి లారెన్ శాంచెజ్ కూడా ఉన్నారు.
What an amazing crew! Great flight this morning. pic.twitter.com/4h5fNGpRRO
— Dave Limp (@davill) April 14, 2025
బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ భారరహితస్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాలు పాటు సాగిన ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. మొత్తం ఆరుగురు మహిళలు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరిలో శాంచెజ్‌తోపాటు అమెరికన్ గాయని కేథీ పెర్రీ, ప్రముఖ జర్నలిస్టు గేల్ కింగ్, చిత్ర నిర్మాత కెరియాన్ ఫ్లిన్, అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాలో ఇంజినీర్‌గా పనిచేసి, ఆ తర్వాత సైన్స్ విద్యను ప్రోత్సహించడానికి సొంత కంపెనీలను ప్రారంభించిన ఐషా బోవ్, ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలపై పరిశోధనలు చేసిన అమండా ఎంగుయెన్ ఉన్నారు.
✨ Weightless and limitless. pic.twitter.com/GQgHd0aw7i
— Blue Origin (@blueorigin) April 14, 2025
ఇక 2000 సంవత్సరంలో బ్లూ ఆరిజిన్ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో రోదసి యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మిషన్లు చేపట్టగా, 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. జెఫ్ బెజోస్ కూడా న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లి భూమ్మీదకు తిరిగి వచ్చారు. 1963లో సోవియట్ వ్యోమగామి వాలెంటీనా తెరిష్కోవా ఒక్కరే రోదసిలోకి వెళ్లి వచ్చారు. అప్పట్లో రోదసియాత్ర నిర్వహించిన తొలి మహిళగా వాలెంటీనా చరిత్ర సృష్టించారు. ప్రస్తుత యాత్రలో పాల్గొన్న శాంచెజ్ హెలికాప్టర్ పైలట్, టీవీ జర్నలిస్టుగా కూడా పనిచేశారు. రెండు నెలల్లో ఆమె బెజోస్‌ను వివాహం చేసుకోనున్నారు.
REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7
— Blue Origin (@blueorigin) April 14, 2025