ETV Bharat / international

బంగ్లా పార్లమెంట్ రద్దు- ఐటీ శాఖ మాజీ మంత్రి అరెస్ట్! హసీనా తమ దేశం రావడం కుదరదన్న యూకే! - Bangladesh Crisis

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 3:34 PM IST

Updated : Aug 6, 2024, 10:49 PM IST

Bangladesh Crisis
Bangladesh Crisis (Associated Press, ANI)

Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు క్షణం క్షణం మారిపోతున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్​లో ఉండగా, తాజాగా ఆ దేశ అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్​ పార్లమెంట్​ను రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో మృతుల సంఖ్య 440కి చేరింది.

LIVE FEED

9:51 PM, 6 Aug 2024 (IST)

బంగ్లా ఆర్మీ ఉన్నత స్థానాల్లో భారీ మార్పులు

ఆర్మీలో అత్యున్నత స్థానాల్లో మంగళవారం భారీ మార్పులు చేసింది బంగ్లాదేశ్‌. అందులో భాగంగా నేషనల్ టెలికమ్యూనికేషన్ మానిటరింగ్ సెంటర్ (NTMC) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ జియావుల్ అహ్సాన్​ను విధుల నుంచి తప్పించింది. ఈ మేరకు ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ (ISPR) - మీడియా విభాగం జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనను ఉటంకిస్తూ స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. ఇక, లెఫ్టినెంట్ జనరల్ ఎండీ సైఫుల్ ఆలమ్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. GOC ఆర్మీ ట్రైనింగ్ అండ్ డాక్ట్రిన్ కమాండ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎండీ మోజిబుర్ రెహ్మాన్ నియామకమయ్యారు. అహ్మద్ తబ్రేజ్ షామ్స్ చౌదరి, ఆర్మీ క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మిజానూర్ రెహమాన్ షమీమ్, కమాండెంట్ ఎన్‌డీసీగా లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ షాహినుల్ హక్, ఎన్‌టీఎంసీ డైరెక్టర్ జనరల్‌గా మేజర్ జనరల్ ఎఎస్ఎమ్ రిద్వానుర్ రెహమాన్​ను నియమించారు.

9:41 PM, 6 Aug 2024 (IST)

ప్రాణాలు నిలపడమే మా బాధ్యత : బంగ్లాలో ఉన్న భారతీయ డాక్టర్లు

బంగ్లాదేశ్‌లో ఉంటున్న అనేక మంది భారతీయ వైద్యులు ఢాకాలోనే ఉండడానికి నిశ్చయించుకున్నారు. వారి భద్రత గురించి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా, ప్రాణాలను రక్షించడానికి తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని అంటున్నారు. "మేము చాలా మంది రోగుల్లో పెల్లెట్ గాయాలు, తుపాకీ, కత్తిపోటు గాయాలను చూస్తున్నాము. సోమవారం రాత్రి నిరసనకారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల తరవాత మరణాల సంఖ్య పెరిగింది. ఇక్కడ వనరుల కొరత ఉంది. మేము రోజుకు 17-18 గంటలు పని చేస్తున్నాము." ఓల్డ్ ఢాకాలోని ఆసుపత్రిలో పనిచేస్తున్న శ్రీనగర్‌కు చెందిన డాక్టర్​ ఫోన్లో పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు.

9:36 PM, 6 Aug 2024 (IST)

హిందూ ఆలయాలపై దాడులు

బంగ్లాదేశ్​లో పలు హిందూ ఆలయాలు, హిందువుల ఇళ్లు, వ్యాపార స్థాలాలు దుండగులు ధ్వంసం చేసినట్లు అక్కడి హిందూ కమ్యూనిటీ నేతలు పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ మహిళను వేధింపులకు గురిచేసినట్లు, అవామీ లీగ్​ పార్టీకి సంబంధించిన ఇద్దరు హిందూ లీడర్లు బంగ్లాలో చెలరేగిన హింసకు బలైనట్లు వెల్లడించారు. ఈ మేరకు హిందువులతో పాటు మైనారిటీలను ఆందోళనకు గురిచేసినట్లు బంగ్లాదేశ్​ హిందూ బుద్ధిస్ట్​ క్రిస్టియానిటీ యూనిటీ కౌన్సిల్ లీటర్​ కాలోజ్​ దేబ్​నాథ్​ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.

9:30 PM, 6 Aug 2024 (IST)

ఐరాసతో దర్యాప్తు జరిపించాలి: యూకే

మరోవైపు బంగ్లాదేశ్‌ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వం స్పందించింది. గత రెండు వారాలుగా అల్లర్ల కారణంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది. ఈ మేరకు యూకే (UK) విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందులో షేక్‌ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్‌ సిద్దిఖీ ప్రస్తుతం లేబర్‌ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం యూకేలో లేబర్‌ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది.

7:19 PM, 6 Aug 2024 (IST)

బంగ్లా​ ఐటీశాఖ మాజీ మంత్రి జునైద్‌ అహ్మద్‌ పలక్‌ అరెస్ట్

బంగ్లాదేశ్​ ఐటీశాఖ మాజీ మంత్రి జునైద్‌ అహ్మద్‌ పలక్‌ అరెస్టయ్యారు. బంగ్లా వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఢాకా విమానాశ్రయంలో ఆయనను అధికారులు అడ్డుకున్నారు. అనంతరం అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెలువరించింది.

"బంగ్లాలో అస్థిరత వేళ, బంగ్లాదేశ్ మాజీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి జునైద్ అహ్మద్ పలక్‌ దేశాన్ని వీడేందుకు ప్రయత్నించారు. ఢాకా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని వీఐపీ లాంజ్‌లో వేచి ఉన్న ఆయనను ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సంప్రదించారు. అంతలోనే అక్కడికి చేరుకున్న ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాను వీడి భారత్‌కు చేరుకునేందుకు అహ్మద్‌ ప్రయత్నించారు' అని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

7:04 PM, 6 Aug 2024 (IST)

హసీనా భారత్​లోనే ఆశ్రయం పొందాలి! : యునైటెడ్ కింగ్​డమ్

ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు తమ వలసచట్టాలు అంగీకరించవని యూకే హోం మంత్రిత్వ శాఖ ప్రతినిది ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. "అవసరంలో ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో యూకేకు గర్వించదగ్గ రికార్డు ఉంది. ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు, వారు మొదట చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలి. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గం" అని మీడియాకు వెల్లడించారు. భారత్‌లోనే ఆశ్రయం పొందాలనే అర్థంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

5:58 PM, 6 Aug 2024 (IST)

ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం

షేక్ హసీనా సోమవారం బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఢాకాలోని ధన్మొండిలో ఉన్న ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రం-IGCCని ధ్వంసం చేశారు. బంగబంధు మెమోరియల్ మ్యూజియంకు నిప్పు పెట్టారు. ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని 2010 మార్చిలో ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు అందులో నిర్వహించేవారు. భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సాంస్కృతిక సంబంధాలను IGCC ప్రోత్సహించేది. భారతీయ కళ, సంస్కృతి, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం ,కాల్పనిక రంగాలకు సంబంధించి 21 వేల పుస్తకాలతో కూడిన గ్రంథాలయాన్ని IGCC కలిగి ఉండేది. ఆందోళనకారులు అందులో నుంచి పలు వస్తువులను దోచుకెళ్లారు. అనంతరం నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్​ అవుతున్నాయి.

4:11 PM, 6 Aug 2024 (IST)

24మంది సజీవ దహనం

బంగ్లాదేశ్​లో షేక్‌ హసీనా రాజీనామా తర్వాత కూడా అందోళకారులు రెచ్చిపోయారు. సోమవారం రాత్రి జోషార్​ జిల్లాలోని అవామీ లీగ్ పార్టీ నేతకు చెందిన ఓ హోటల్​కు నిప్పు అంటించినట్లు స్థానిక మీడియా వార్తలు వెలువరించింది. ఈ ఘటనలో ఇండోనేషియా జాతీయుడుతో సహా 24మంది సజీవ దహనమైనట్లు పేర్కొంది. అయితే మరికొంతమంది హోటల్ సిబ్బంది శిథిలాల కింద ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, అవామీ లీగ్ పార్టీ నేతల నివాసాలు, వ్యాపార సంస్థలను ఏకకాలంలో ధ్వంసం చేసినట్లు పలు వార్త సంస్థలు పేర్కొన్నాయి.

3:40 PM, 6 Aug 2024 (IST)

బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ పార్లమెంట్​ను రద్దు చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాజకీయ నేతలు, త్రివిధ దళాధిపతులు, పౌర సంఘాలతో చర్చల అనంతరం ఈ మేరకు అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే సైన్యం నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుందని పేర్కొంది.

Last Updated : Aug 6, 2024, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.