Trump On Iran : ఇరాన్‌లో నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా, ఇరాన్ నాయకత్వ మార్పు తమ ఉద్దేశం కాదని, ఆ దేశంలో అణు స్థావరాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని చెప్పిన ట్రంప్ తాజాగా 'మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్' పేరుతో పెట్టిన పోస్ట్ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా చేపట్టిన అకస్మాత్తు వైమానిక దాడుల తర్వాత, ఇరాన్‌లో ప్రస్తుత పాలన భవిష్యత్తుపై ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అనేక సందేహాలకు సంకేతాలుగా మారాయి.
'పాలన మార్పు అనే పదాన్ని వాడటం రాజకీయంగా సరైంది కాదేమో. కానీ ప్రస్తుత ఇరానియన్ పాలకులు ఆదేశాన్ని గొప్పగా పాలన మార్పు ఎందుకు ఉండకూడదు?' అని ట్రంప్ ఆదివారం రాత్రి ఈ పోస్టు చేశారు. ట్రంప్ చేసిన ట్వీట్ అదే రోజు ఉదయం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలకు చాలా విరుద్ధంగా ఉంది. తాము చేసిన దాడి పాలన మార్పు కోసం కాదని, తమ లక్ష్యం అధి కాదని ట్రంప్ పేర్కొన్నారు.
US President Donald Trump posts, " it's not politically correct to use the term, 'regime change', but if the current iranian regime is unable to make iran great again, why wouldn't there be a regime change??? miga!!!" pic.twitter.com/RwA95Ec4ut
— ANI (@ANI) June 22, 2025
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు ఇరాన్‌లో నాయకత్వ మార్పుపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. 'అమెరికాపై ప్రతీకార చర్యలకుగానీ, ఇరాన్ అణు ఆయుధాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తే ప్రస్తుతం ఉన్న పాలన ప్రమాదంలో పడుతుంది' అని హెచ్చరించారు.
ట్రంప్‌తో ఆయన మంత్రులు కూడా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ చేసిన పోస్టు పోస్టు గందరగోళంగా, అనేక అనుమానలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌ను హెచ్చరించడమా? ఆ దేశాన్ని సవాల్ చేయడం ద్వారా పరిణామాలను తీవ్రమయ్యేలా చేయడమా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఏది ఏమైనా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి అమెరికా వ్యవహారం మరింత విస్తరించే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చలకు అవకాశం ఉందంటూనే దాడులు చేయడం ద్వారా అమెరికా ఏం చెప్పదల్చుకుందో అనేది అర్థం కాని పరిస్థితి. అంటే ఇరాన్ సైనిక సామర్థ్యం తక్కువగా ఉన్నందున, చర్చలకు రావాల్సిన అవసరం ఆదేశానికే ఉందనే భావనలో అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ట్రంప్ చేసిన పోస్టు మాత్రం భవిష్యత్తులో రాజకీయాలను, జియోపాలిటికల్ పరిణామాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.