ETV Bharat / health

యువతలో పెరుగుతున్న 'ఒత్తిడి'?- ఈ లక్షణాలతో ఈజీగా తెలుసుకోవచ్చట!

-యువతలో పెరుగుతున్న డిప్రెషన్​ - తొలి దశలో గుర్తించడమే కీలకమంటున్న నిపుణులు!

Young People Mental Health
Young People Mental Health (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : September 25, 2025 at 3:35 PM IST

3 Min Read
Choose ETV Bharat

Young People Mental Health: నచ్చని చదువు, మెచ్చని మనువు, అచ్చిరాని కొలువు యువ మనసులను కుంగదీస్తున్నాయి. ఒత్తిడిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. చివరకు ఆత్మహత్యలకూ ప్రేరేపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మందు మన దగ్గరే ఉందంటున్నారు నిపుణులు. కుంగుబాటుకు గురైన వారిని వెన్నుతట్టి, మేమున్నామనే భరోసా ఇస్తే, వారిలోని ఒత్తిడిని తరిమికొట్టడం, కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో కనిపించే మానసిక ప్రవృత్తులను సకాలంలో గుర్తించాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

మనదేశంలోని టీనేజీ యువతలో 27 శాతం మంది డిప్రెషన్​కు గురవుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే, 18-29 ఏళ్ల యువతలో 7.3 శాతం మంది మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ భారత్ నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో నేటి సమాజం దీన్నొక రుగ్మతగా గుర్తించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. వర్గాల వారీగా వారిని విభజించి చూస్తే సమస్యలకు మూల కారణాలు అర్థమవుతాయని తెలిపారు.

Stress in young people
యువతలో ఒత్తిడి (Getty Images)

ఫ్లైట్ జర్నీలో షార్ట్స్​ వేసుకుంటే ఏం జరుగుతుంది? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

పాఠశాల విద్యార్థులు (10-17 ఏళ్లు) :

సమస్యలు :

  • పరీక్షల ఒత్తిడి, ఫలితాల భయం
  • చదువులో పోటీ
  • తల్లిదండ్రుల అంచనాలు
  • స్నేహితులతో పోలికలు

లక్షణాలు: నిస్పృహ, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలవకపోవడం, భయం, తక్కువ ఆత్మవిశ్వాసం లాంటి లక్షణాలను కలిగి ఉంటారు.

ఇదీ లెక్క :

  • ఎన్​సీఈఆర్​టీ సర్వే(2022): 43 శాతం విద్యార్థులు మూడ్ స్వింగ్స్, 11 శాతం యాంగ్జైటీ, 14 శాతం తీవ్రమైన భావోద్వేగ సమస్యలతో బాధపడ్డారని NCERT సర్వే చెప్పింది.
  • ఇక ఎన్​సీఆర్​బీ ప్రకారం, 2019-2021 మధ్య 13000+ స్కూల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారట.
Stress in young people
యువతలో ఒత్తిడి (Getty Images)

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తి, ఇష్టం, సామర్థ్యానికి భిన్నంగా బలవంతంగా వాళ్ల ఇష్టాలను రుద్దుతారు. దీంతో తెలియకుండానే పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోతోంది. పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పించకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఆత్మన్యూనతకు లోనై స్వీయ హానికి పాల్పడుతున్నారు. ఆల్కహాల్, డ్రగ్స్ యువతలో ప్రమాదకరంగా పరిణమించాయి. ఉపాధ్యాయులు కూడా కేవలం బోధనకే పరిమితమవుతున్నారు. నైతిక విలువల బోధన అనేది దాదాపు కొరవడింది- డాక్టర్ గౌరీదేవి, సీనియర్ సైకియాట్రిస్ట్

కాలేజీ యువత (18-24 ఏళ్లు) :

సమస్యలు :

  • ఐడెంటీటీ క్రైసిస్, ప్రేమ సంబంధాల్లో నిరాశ
  • ర్యాంకులు, ప్లేస్​మెంట్ టెన్షన్,
  • మద్యం లేదా డ్రగ్స్​ వ్యసనం
  • సోషల్ మీడియా ప్రభావం
  • బైపోలార్ డిజార్డర్ అండ్ స్కిజోఫ్రేనియా వంటి మానసిక రుగ్మతలు

లక్షణాలు : ఆందోళన, అకస్మాత్తుగా కోపం, డిప్రెషన్, నిద్రలేమి, పానిక్ అటాక్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్​లలో పోలికలు, లైక్స్ లేదా ఫాలోవర్స్ మీద ఆధారపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.

ఇదీ లెక్క :

  • పీక్ మైండ్ రిపోర్ట్ ప్రకారం, కౌన్సెలింగ్ కోరుతున్న కాలేజీ విద్యార్థులు 65 శాతం పెరిగారట.
  • ఐఐటీల్లో కౌన్సెలింగ్ విజిట్స్ 2-3 రెట్టు పెరిగాయి.
  • డబ్ల్యూహెచ్​ఓ ప్రకారం, భారతదేశంలోని యువతలో సుమారు 13 శాతం మందిలో వ్యసన సమస్యలున్నాయని అంచనా.
Stress in young people
యువతలో ఒత్తిడి (Getty Images)

ఇంట్లో పెద్దవారి నుంచి మార్గదర్శనం, పర్యవేక్షణ ఉండట్లేదు. ప్రేమ, రిలేషన్​షిప్స్ కూడా యువతలో మానసిక రుగ్మతలను పెంచుతున్నాయి. బెట్టింగ్​లు, ఆన్​లైన్ గేమ్​లతో నష్టపోతున్నారు. విలువలు, దయాగుణం, కుటుంబ సంబంధాలను చిన్నతనం నుంచే నేర్పించాలి. కోరుకున్న ఉద్యోగం దొరక్కపోతే ఇక జీవితమే లేదనే భావన నుంచి పిల్లలను దూరం చేయాలి. ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయనే విషయాన్ని వివరించాలి- డాక్టర్ గౌరీదేవి, సీనియర్ సైకియాట్రిస్ట్

ఉపాధిలో ఉన్న యువత (25-29 ఏళ్లు) :

సమస్యలు :

  • ఉద్యోగ ఒత్తిడి, టార్గెట్స్ అండ్ డెడ్​లైన్స్
  • జాబ్ ఇన్​సెక్యూరిటీ, లేఆఫ్​ల భయం
  • వర్క్​లైఫ్ ఇన్ బ్యాలెన్స్
  • సింగిల్​గా ఉండడం లేదా వివాహ సంబంధ సమస్యలు

లక్షణాలు : వర్క్​ ప్లేస్ బర్న్​ అవుట్, ఆందోళన, కుంగుబాటు, ఆల్కహాలిజమ్, ఆత్మహత్య ఆలోచనలు

ఇదీ లెక్క :

  • నీతి ఆయోగ్ 2024 సర్వే ప్రకారం, భారతదేశంలో 23 కోట్ల మంది మానసిక ఒత్తిడిలో ఉన్నారట. అందులో ఎక్కువ మంది యువ ఉద్యోగులు
  • గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ పకారం, 'మెంటల్ హెల్త్ హెల్ప్ నియర్ మి' లాంటి సెర్చ్​లలో 420 శాతం పెరుగుదల నమోదైంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పిల్లల విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి! - మీకు తెలియకుండా జరుగుతున్నది ఇదే!

కుక్కలు వెంటపడితే ఏం చేయాలి? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!