ETV Bharat / health

"తరచూ కడుపు నొప్పి"తో బాధపడుతున్నారా? - అది కూడా ఆ "మహమ్మారి" లక్షణమే! - WARNING SIGNS OF COLON CANCER

విస్తరిస్తున్న పెద్ద పేగు క్యాన్సర్ - లక్షణాలు వెల్లడించిన నిపుణులు

Warning_Signs_Of_Colon_Cancer
Warning_Signs_Of_Colon_Cancer (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : June 10, 2025 at 2:51 PM IST

3 Min Read

Warning Signs Of Colon Cancer : ప్రస్తుతం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రపంచం వ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు పెద్దపేగు క్యాన్సర్ (colon Cancer) రెండో ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఒకప్పుడు పెద్దపేగు క్యాన్సర్ వృద్ధుల్లో ఎక్కువగా కనిపించేది. కానీ, ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా వస్తోందంటున్నారు నిపుణులు. ఈ క్యాన్సర్ నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. అయితే ఈ క్యాన్సర్​ను ముందుగానే గుర్తించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ క్యాన్సర్​ను సూచించే హెచ్చరిక సంకేతాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం!

కడుపు నొప్పి
కడుపు నొప్పి (Getty image)

మలవిసర్జనలో మార్పులు : తరచూ మల విసర్జనలో మార్పులు గమనించినట్లయితే వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం పాటు ఉండే విరేచనాలు, మలబద్ధకం లేదా మలం కుంచించుకుపోవడం వంటి మలవిసర్జనలో మార్పులు కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మలబద్ధకం ఉన్న వ్యక్తులకు పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని 'జర్నల్ ఆఫ్ నేషనల్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్' అనే జర్నల్​లో ప్రచురితమైంది.

మలంలో రక్తం : పెద్ద పేగు క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాలలో ఇది కూడా ఒకటని mayoclinic అధ్యయనంలో పేర్కొంది. ముఖ్యంగా మలద్వారం నుంచి లేదా మలంలో కానీ రక్తం పడటం గమనించినట్లయితే వెంటనే అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కొంత మందికి మలంలో రక్తం కలిసిపోయి విరేచనం నల్లగానూ అవ్వొచ్చనని పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే సంబంధించిన డాక్టర్​ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

"మూడు అడుగులతో షుగర్ కంట్రోల్"​! - స్పష్టంగా వెల్లడించిన ఆయుర్వేదం

మలవిసర్జనలో మార్పులు
మలవిసర్జనలో మార్పులు (Getty image)

కడుపు నొప్పి : ఈ క్యాన్సర్​కు సంబంధించి తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన లక్షణం కడుపు నొప్పి ఒకటని National Cancer Institute అధ్యయనంలో వెల్లడైంది. నిరంతర కడుపునొప్పి, తిమ్మిరి, ముఖ్యంగా మందులు తీసుకున్న తర్వాత కూడా కడుపులో అసౌకర్యంగా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బరువు తగ్గడం
బరువు తగ్గడం (Getty image)

బరువు తగ్గడం : ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా బరువు తగ్గడం పెద్దపేగు క్యాన్సర్​తో సహా అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్యాన్సర్ కణాలు చాలా వేగంగా పెరగడం వల్ల శరీరంలోని శక్తిని, పోషకాలను ఎక్కువగా వినియోగించుకుంటాయని వివరించారు. దీంతో శరీరం తక్కువ కేలరీలను నిల్వ చేసుకుంటుందని, దీని వల్ల బరువు తగ్గుతారని పేర్కొన్నారు. తెలియని కారణం లేకుండా బరువు తగ్గడం అనేది పెద్దపేగు క్యాన్సర్ లక్షణమని medlineplus అధ్యయనంలో పేర్కొంది.

అలసట
అలసట (Getty image)

అలసట : సరైన ఆహారం, తగినంత నిద్రపోయాక కూడా అలసటగా అనిపిస్తుంటే పెద్దపేగు క్యాన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీవ్రమైన అలసటను ఎదుర్కొంటుంటే మాత్రం సంబంధిత డాక్టర్లు సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆకలి లేకపోవటం, తీవ్రమైన రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నా అలర్ట్ కావాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రక్తహీనత పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చనని clevelandclinic పేర్కొంది.

Colon Cancer
Colon Cancer (Getty image)

తీసుకోవాల్సిన చర్యలు : ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. రోజువారీ ఆహారంలో భాగంగా పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా బరువును నియంత్రణలో ఉంచుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ మీకు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉండే వంటివి దూరంగా ఉండటం మంచిదని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డయాబెటిస్ రోగులు ఈ ఆహారం తింటే మంచిదట! - షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయంటున్న నిపుణులు!

"లివర్" డేంజర్​లో ఉన్నట్లు చెప్పడానికి ట్రై చేస్తుందని మీకు తెలుసా? - ఈ లక్షణాలన్నీ అందులో భాగమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.