రోజువారీ వాకింగ్‌లో ఈ "షార్ట్‌కట్స్" పాటించండి - తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్!
ఇలా చేస్తే రోజంతా ఉత్సాహం - నిపుణులు చెప్తున్న విషయాలివి

Published : September 24, 2025 at 12:32 PM IST
Types of Walking that Improve Health : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్, ఒబెసిటీ, పీసీఓఎస్ వంటి పలు రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్పులు, శారీరక శ్రమ తగ్గడం వల్లే ఇలాంటి సమస్యలు చుట్టుముడుతున్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండడానికి చాలామంది నడకను తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. అయితే, సాధారణ నడకతో పాటు విభిన్న రకాలుగా నడవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందచ్చని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

చేతులు పైకెత్తి : తడాసన నడక యోగాలో పర్వతాసనాన్ని పోలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నడకలో భాగంగా రెండు చేతుల వేళ్లను జోడించి వ్యతిరేక దిశలో తిప్పి పైకెత్తాలని, అరికాళ్లు నేలకు తగలకుండా మునివేళ్లపై నడవాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని ప్రధాన కండరాలు దృఢంగా మారతాయని, నిటారుగా నడవడం వల్ల శరీరాకృతి కూడా మెరుగుపడుతుందని వివరించారు. ఈ నడకను అలవాటు చేసుకోవడం వల్ల రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉండచ్చంటున్నారు.
'గుండెకు' ముప్పు తెచ్చే అలవాట్లు ఇవే! - వీటికి దూరంగా ఉండాలంటున్న నిపుణులు

ఎనిమిది ఆకృతిలో : సాధారణ నడకలో భాగంగా తిన్నగా కొంతదూరం నడుస్తుంటాం. అలా కాకుండా ఒకే ప్రాంతంలో ఎనిమిది అంకె లాగే తిరుగుతూ నడవడాన్ని సిద్ధ నడక అంటారు. ఈ నడకలో భాగంగా ఒక ప్రాంతంలో ఒకే సరళ రేఖపై కాస్త దూరంలో రెండు వస్తువులు పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటి చుట్టూ ఎనిమిది అంకె వచ్చేలాగే వాకింగ్ చేయాలంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల శారీరకంగానే కాదు, మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుందని, ఏకాగ్రతకు ఈ నడక మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళనల నుంచి విముక్తి పొందచ్చని, మెదడు పనితీరు మెరుగుపడి సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలూ అలవడతాయని వివరించారు.
రివర్స్ వాకింగ్ : నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఉన్నాయి. అయితే రివర్స్ వాకింగ్ వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కాస్త కష్టమే అయినా, ఈ నడక వల్ల మోకాళ్ల కండరాలు దృఢంగా మారతాయని, కీళ్లపై ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. అలాగే శరీరాకృతి నిటారుగా మారడంలోనూ ఈ నడక కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు.

తుంటితో ఇలా : ఈ నడకలో భాగంగా రెండు చేతులను నమస్కారం పోజులో పెట్టి, రెండు కాళ్లు చాపి కూర్చోవాలని తెలిపారు. ఇప్పుడు తుంటిపై ఒత్తిడి పడేలా ఒక్కో కాలిని కదిలిస్తూ ముందుకు జరగాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని ప్రధాన కండరాలతో పాటు కాళ్లలో కండరాలు కూడా దృఢంగా మారతాయని చెబుతున్నారు.
కాకి లాగా : ఈ నడకలో భాగంగా స్క్వాట్ పోజ్ లేదా కాకి భంగిమ లాగా కూర్చోవాలి. రెండు చేతులతో రెండు మోకాళ్లను పట్టుకొని ముందుకు నడవాలని చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పొట్ట కండరాలు బలోపేతం అవుతాయని, తద్వారా జీర్ణశక్తి మెరగువుతుందంటున్నారు. అంతేకాకుండా కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని వివరించారు. అంతేకాకుండా, ఈ భంగిమలో నడవడం వల్ల ప్రత్యుత్పత్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"యూరిక్ యాసిడ్"తో బాధపడుతున్నారా? - 'ఇవి' తింటే ఉపశమనం ఉంటుందంటున్న పరిశోధనలు!
ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం తింటే ఏం జరుగుతుంది? - ఏపీ, తెలంగాణలోని ఆ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువ!

