ETV Bharat / health

బీసేఫ్​- టాటూ వేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్​ తప్పవ్! - Tattoo Ink Side Effects

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 3:41 PM IST

Tattoo Ink Side Effects : టాటూ వేయించుకోవడం సరదాగానే ఉంటుంది కానీ, దాని వల్ల శరీరానికి కలిగే నష్టాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? కొన్ని జాగ్రత్తలు మర్చిపోయి టాటూ వేయించుకున్నారంటే ఇక అంతే సంగతులు! అవేంటంటే?

Tattoos
Tattoos (Associated Press)

Tattoo Ink Side Effects : ప్రస్తుత జనరేషన్‌లో టాటూలు వేసుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఆడ, మగా అనే తేడా లేకుండా శరీరంలో తమకు ఇష్టమైన చోట వేయించుకుని సరదా తీర్చేసుకుంటున్నారు. మరికొందరైతే ఒళ్లంతా వింతైన టాటూ (పచ్చబొట్టు)లతో దర్శనమిస్తుంటారు. ఇలా టాటూలు వేసుకోవడం చాలా సరదాగా అనిపించొచ్చు, సంతోషాన్ని ఇవ్వొచ్చు. కానీ, వీటి వల్ల శరీరానికి ఎంతవరకూ ప్రమాదం ఉంది? సుదీర్ఘ కాలంలో ఎటువంటి రిస్క్​ ఎదుర్కోవలసి వస్తుందనేది నిపుణులు జరిపిన పరిశోధనల ఆధారంగా తెలుసుకుందాం.

టాటూలు శరీరానికి నిజంగా హాని కలిగిస్తాయా అనేది తెలుసుకోవడానికి టాటూ వేసేందుకు వినియోగించే 75 రకాల ఇంకులపై పరీక్ష జరిపారు. వాటిలో 26శాంపిల్స్‌లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిసింది. ఆ ఇంకులు టాటూ వేసే నీడిల్స్‌తో కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ కలుగుతుందని గుర్తించారు. మామూలుగా శరీరానికి ఉండే సహజ లక్షణం ఏదైనా గాయం కలిగితే అది మానిపోయేలా చేయడం. కానీ, ఈ టాటూలు వల్ల కలిగే గాయంతో పాటు ఇన్ఫెక్షన్ కూడా తోడై చర్మానికి హాని కలిగిస్తుంది. దీంతో కెమికల్స్ ప్రభావం చర్మంపైన మాత్రమే కాకుండా శరీరం లోపలకు కూడా వ్యాపిస్తుందని రీసెర్చ్​లో తేలింది. ఈ రిస్క్ అనేది చాలా తక్కువ మందిలోనే కనిపిస్తుంది. కానీ, సమస్య కనిపించిన వారిలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. టాటూల్లో ప్రాణాన్ని హరించే ఇన్ఫెక్షన్లు ఏమేం ఉన్నాయంటే?

బ్యాక్టీరేమియా : రక్తంలో బ్యాక్టీరియా ఉండటం.

ఎండోకార్డిటైస్ : గుండె అంతర్భాగంలో ఇన్ఫెక్షన్ వస్తుంది.

సెప్టిక్ షాక్ : ఇన్ఫెక్షన్​కు గురైన వెంటనే బీపీ అనేది తగ్గిపోతుంది. టాటూ వేయించుకోవడం వల్ల ప్రాణాపాయం లేకపోయినా ఈ సమస్యలు తప్పవని స్టడీలో తేలింది.

అలర్జిక్ రియాక్షన్స్
గ్రాన్యులోమా : తెల్ల రక్త కణాల్లో నాన్ క్యాన్సిరస్ క్లస్టర్ ఏర్పడటం

కెలాయిడ్స్ : టాటూ చుట్టువైపులా ఉబ్బడం.

ఇటువంటి ప్రమాదాలు, సమస్యలు రాకుండా ఉండాలంటే రెప్యూటబుల్ టాటూ ఆర్టిస్, లేదా టాటూ స్టూడియోకు వెళ్లి హైజిన్ గా ఉన్నారని కన్ఫమ్ చేసుకున్న తర్వాత టాటూ వేయించుకోవాలి. టాటూ వేసే వారికి సర్టిఫికేషన్, ప్రోపర్ లైసెన్సింగ్ ఉందా, సేఫ్టీ రెగ్యూలేషన్స్ పాటిస్తున్నారా అనేవి తెలుసుకుంటే ఇంకా బెటర్.

టాటూ వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు
టాటూ వేసుకున్న ప్రాంతం పొడిబారకుండా, శుభ్రంగా ఉంచుకోవాలి.

  • నేరుగా దానిపై సన్​లైట్ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • టాటూ వేసినప్పుడు ఏర్పడే పుండు తగ్గేంతవరకూ స్విమ్మింగ్ పూల్స్ లేదా హాట్​ టబ్స్​కు దూరంగా ఉండాలి.
  • మురికి చేతులతో టాటూను తాకకుండా ఉండటం మంచిది.

నగర యువత చూపు... టాటూ వైపు

అతడి బాడీపై 631 టాటూలు.. అన్నీ వారి బొమ్మలు, పేర్లే.. గిన్నిస్​ రికార్డ్స్​లో చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.