ETV Bharat / health

షుగర్ పేషెంట్లకు రెడ్ అలర్ట్ - ఈ స్వీట్​తో గుండె పోటు ముప్పు - వెల్లడించిన రీసెర్చ్! - Artificial Sweeteners Side Effects

Artificial Sweeteners Side Effects : ఈ మధ్యకాలంలో చాలా మంది షుగర్ పేషెంట్లు.. బరువు తగ్గాలనుకునే వారు చక్కరకు బదులుగా మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీట్‌నర్స్ యూజ్ చేస్తున్నారు. అయితే.. వీటి వల్ల జరిగే మేలు కంటే హాని ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 10:27 AM IST

Side Effects of Artificial Sweeteners
Artificial Sweeteners Side Effects (ETV Bharat)

Side Effects of Artificial Sweeteners : ఈ రోజుల్లో చాలా మంది చక్కెరకు బదులు ఆర్టిఫీషియల్ స్వీట్​నర్స్ వాడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రాకుండా జాగ్రత్తపడేవారు, బరువు తగ్గాలనుకునే వారు ఆర్టిఫిషియల్ స్వీట్​నర్స్​తో(Artificial Sweeteners) తయారైన కూల్​డ్రింకులు, షుగర్ ఫ్రీ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో వెల్లడైంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆర్టిఫిషియల్ స్వీట్​నర్స్​తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అటుంచితే.. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో "డాక్టర్ స్టాన్లీ హాజెన్" నేతృత్వంలోని పరిశోధకుల బృందం NIH నిధులతో చేసిన ఈ అధ్యయనంలో.. స్వీట్​నర్ గుండె జబ్బులను తీవ్రతరం చేస్తుందని కనుగొన్నారు.

ఈ స్వీట్​నర్స్​.. రక్తంలోని జిలిటోల్ స్థాయిలను, ప్లేట్‌లెట్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో పరీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు 2024, జూన్​లో "యూరోపియన్ హార్ట్ జర్నల్‌"లో ప్రచురితమయ్యాయి. ఈ రీస్చెర్ కోసం.. 10 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల నుంచి రక్త నమూనాలను తీసుకున్నారు. స్వీట్​నర్స్ తీసుకున్న తాగిన అరగంటలో రక్తంలో జిలిటోల్ స్థాయిలు 1,000 రెట్లు పెరిగాయని గుర్తించారు. 4 నుంచి 6 గంటల తర్వాత బేస్‌లైన్‌కి తిరిగి వచ్చాయి. అంతేకాదు.. రక్తంలో జిలిటోల్ స్థాయిలు(National Institutes of Health రిపోర్టు) ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు.

రక్తంలో జిలిటోల్ స్థాయిలు అధికంగా ఉన్న వ్యక్తులకు.. హృదయ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం 50% ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే.. వీలైనంత వరకు వీటి వినియోగానికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. షుగర్ తగ్గించుకోవడానికి వ్యాయామం, సరైన డైట్​ పాటించాలే తప్ప, ఇలాంటి షార్ట్ కట్స్ ఫాలో అయితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

బిగ్ అలర్ట్ : మీరు వాడే టూత్​పేస్ట్ గుండె జబ్బులకు దారి తీస్తుందట! - ఎలాగో తెలుసా?

అలర్ట్ : షుగర్, గుండె పోటు, ఊబకాయం - ఇవి​ రావడానికి కారణం తెలిసిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.