Easy Ways to Prevent Indigestion : మనలో చాలా మంది అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా టైం లేక చాలా మంది బయటి ఆహారం తీసుకునే వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇదే కొన్నిసార్లు జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రాసెస్ట్ పుడ్, ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఆహారం, నూనె పదార్థాలు వంటివన్నీ త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేసుకోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అజీర్తికి జీలకర్ర దివ్యౌషధం : కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు లేదా ఎసిడిటీ బాధిస్తున్నప్పుడు కాస్త జీలకర్రను నమలడం వల్ల ఉపశమనం కలుగుతుందని NIH పరిశోధకులు చెబుతున్నారు. టేబుల్‌స్పూను జీలకర్రను శుభ్రంగా కడిగి, నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. అనంతరం పరగడుపున ఆ నీటిని తాగి జీలకర్రను తినాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు చేయడం వల్ల అజీర్తి, మలబద్ధకం అనేవి మటుమాయం అవుతాయట.

రెండు టీస్పూన్ల జీలకర్రను పావులీటరు నీటిలో వేసి స్టౌవ్‌పై బాగా మరిగించాలి. నీరు సగానికి వచ్చేవరకు చూసుకోవాలి. ఆ తర్వాత నీరు చల్లారక జీలకర్ర కషాయాన్ని వడగట్టి, పరగడుపున తాగాలి. ఇలా రోజు చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుముఖం పడుతుందని తెలిపారు. అంతే కాకుండా ఊబకాయం నుంచి కూడా విముక్తి పొందవచ్చనని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా జీలకర్రకు బదులుగా వామును ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే వామును తక్కువగా మోతాదులో వాడాకోవాలని సూచిస్తున్నారు. ఒక టీస్పూను జీలకర్రకు బదులుగా పావు టీ స్పూను వామును వాడడం మంచిదని చెబుతున్నారు.

పుదీనా, తులసి : పుదీనా, తులసి ఆకుల్ని నీటితో శుభ్రంగా కడిగాలి. తర్వాత పావులీటరు నీటిలో వేసి బాగా మరగించాలి. నీరు సగానికి వచ్చే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద నుంచి దించాలి. మరిగించిన నీళ్లు పూర్తిగా చల్లారాక ఆకులు తిని నీళ్లును తాగాలి. ఇలా క్రమం తప్పుకుండా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గముఖ పడతాయి. దీంతో పాటు శరీరంలోని మలినాలు కూడా తొలిగిపోవడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడంతో పాటు చర్మానికి కూడా మెరుపూ వస్తుందని NIH అధ్యయనంలో తేలింది.

ఇంగువ : ఉదయాన్నే పరగడుపున పావు స్పూన్ ఇంగువని గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మలబద్ధకం నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అల్లం రసం : అజీర్తికి, పైత్యానికి అల్లం రసం వాడటం పూర్వ కాలం నుంచే అలవాటుగా వస్తుంది. ఈ క్రమంలో అల్లం ముక్కను చిన్నగా తురిమి అర గ్లాసు నీటిలో వేసుకోవాలి. అలా ఆ నీరు సగానికి వచ్చే వరకూ మరగించుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత వడగట్టిన ఈ కషాయాన్ని తాగితే అజీర్తి తగ్గుతుందని NIH పరిశోదకులు చెబుతున్నారు. అయితే ఈ చిట్కాలు పాటించినా ఉపశమనం లేకపోతే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కొవ్వు ఆరోగ్యానికి మంచిదేనా? ఈ బ్రౌన్ ఫ్యాట్ గురించి మీకు తెలుసా?
నెగెటివ్ థింకింగ్ ఎంత ప్రమాదమో తెలుసా? - ఇలా తరిమికొట్టొచ్చు!